భాష్యం విద్యార్థికి క్యారమ్స్ టోర్నమెంట్‌లో ద్వితీయ బహుమతి
తొమ్మిదవ తరగతి విద్యార్థి దాదె అనంత హరినాద్ ప్రతిభకు యాజమాన్యం ప్రశంసలు
హైదరాబాద్ :వాయిస్ టుడే
Dade Anantharinad receiving the medal


తెలంగాణ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూడు జోన్ల పరిధిలో మహేశ్వరం ప్రాంతంలో నిర్వహించిన అంతర్ పాఠశాల క్రీడా పోటీలలో భాష్యం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచారు. ఈ క్రీడా పోటీల్లో భాగంగా జోన్–1, ఎస్.ఆర్.నగర్ భాష్యం స్కూల్ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు పలు క్రీడా విభాగాల్లో విజేతలుగా నిలిచి సంస్థకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ పోటీలలో క్యారమ్స్, కోకో, కబడ్డీ, వాలీబాల్, చెస్, రన్నింగ్ వంటి విభాగాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, ముఖ్యంగా క్యారమ్స్ పోటీల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న దాదె అనంత హరినాద్ ద్వితీయ స్థానం సాధించి రెండవ బహుమతి పొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గట్టి పోటీ మధ్య ఈ విజయం సాధించడం ఆయన క్రమశిక్షణ, పట్టుదలకి నిదర్శనమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, భాష్యం విద్యాసంస్థలు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలిపారు. అనంత హరినాద్ క్రీడల్లోనే కాకుండా చదువులో కూడా మంచి ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన కోచ్‌ల వద్ద శిక్షణ పొందుతూ చెస్ పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచడం ప్రశంసనీయం అని తెలిపారు. అనంత హరినాద్ సాధించిన విజయంపై పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్ఈఓ శిరీష మేడం, పాఠశాల ప్రిన్సిపాల్, పీటీలు ఎం. రాజు, జె. శేఖర్‌లకు అనంత హరినాద్ తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు


