నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ట్రెండీ కామెడీ మూవీ “పాంచాలి పంచ భర్తృక” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
“Panchali Pancha Bhartrika” title, first look poster released
రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “పాంచాలి పంచ భర్తృక”. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, జెమినీ సురేష్, ర్యాప్ సింగర్ రోల్ రిడా హీరోలుగా నటిస్తున్నారు. నట కిరీటి రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. “పాంచాలి పంచ భర్తృక” చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో ట్రెండీ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు డైరెక్టర్ గంగ సప్తశిఖర.
ఈ రోజు నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “పాంచాలి పంచ భర్తృక” సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ఒక కొత్త కథతో, కొత్త దర్శకుడు చేస్తున్న కుర్రకారు సినిమా ఇది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి అనేది తెరపైనే చూడాలి. సరదాగా సాగే చిత్రమిది. చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి కామెడీ మూవీలో నటించాను. ఈ సినిమాను ఆదరించి, కొత్త వాళ్లను సపోర్ట్ చేయండి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ – పాంచాలి పంచభర్తృక ఈ పదం మనం విన్నదే అయినా టైటిల్ గా పెట్టేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. ఈ టైటిల్ లోనే ఒక ఫన్ ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించి హిట్ కావాలని కోరుకుంటున్నా. జెమినీ సురేష్, రోల్ రిడా ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. వీళ్లతో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.
మహేశ్ నారాయణ, బిషేక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాబీ కేఎస్‌ఆర్ కథను అందించగా, రాజ్ పవన్ స్క్రీన్‌ప్లే రాశారు. “పాంచాలి పంచ భర్తృక” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రోల్ రిడా, జెమినీ సురేష్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సరీహ్ ఫర్, రూపలక్ష్మి, వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్, రవి రెడ్డి, జబర్దస్త్ నవీన్, డాన్ చింటూ, సునీత మనోహరి, మాయ నెల్లూరి, అఖాన్, బాలా తదితరులు


