వాయిస్ టుడే క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌.!

- Advertisement -

వాయిస్ టుడే క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌.!

ఆవిష్క‌రించిన బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజ.

Voice Today Calendar Launch!

వాయిస్ టుడే న్యూస్, జ‌న‌వ‌రి 13 బోడుప్పల్ : గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి బోడుప్పల్ సర్కిల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో వాయిస్ టుడే దినపత్రిక నూతన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాయిస్ టుడే దిన పత్రిక అనతికాలంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన తెలుగు దిన పత్రికగా పేరు పొందిందని, జ‌ర్న‌లిస్టుల పాత్ర అత్యంత‌ కీల‌క‌మైన‌ద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్ప‌డు జర్నలిస్టులు స్పందించాలని, మీడియా రంగంలో అనేక మార్పులు వ‌చ్చాయ‌ని, అయినా జ‌ర్న‌లిస్టులు బాధ్య‌తాయుతంగా మెల‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, గ‌తంతో పోలిస్తే నేడు స‌మాచారం అందిచండ‌లో పోటీ పెరిగింద‌ని అయినా ప్రింట్ మీడియా ప్రాధాన్య‌త త‌గ్గ‌లేద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మేడిపల్లి మండలం వాయిస్ టుడే రిపోర్టర్ సొల్లేటి రఘు ఆధ్వర్యంలో న‌మ‌స్తే హైద‌రాబాద్ దిన‌ప‌త్రిక ఎడిట‌ర్,గోడిశాల సోమయ్య, మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ టీయూడ‌బ్ల్యూజే(హెచ్‌-143) అధ్యక్షులు. సంఘం స‌భ్యులు న‌వీన్‌కుమార్‌, గొట్టిముక్క‌ల కిశోర్‌, వేముల‌ శ్రీనివాస్‌గౌడ్‌, రిపోర్టర్స్ బుచ్చిరెడ్డి, ఉద‌య్ త‌దిత‌రులు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular