Sunday, January 25, 2026

హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి…

- Advertisement -

హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి…

ప్రత్యేక కోర్సులో చేరిక.హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం రేవంత్

5 రోజుల పాటు కొనసాగనున్న ‘లీడర్‌షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ కోర్సు

భారతదేశంలో ఇలాంటి కోర్సులో చేరుతున్న తొలి సిట్టింగ్ సీఎంగా గుర్తింపు

కోర్సు పూర్తయ్యాక హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్న రేవంత్

CM Revanth Reddy as a Harvard student…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరనున్నారు. ఆయన 5 రోజుల పాటు జరిగే ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు తన పేరును నమోదు చేసుకున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పదవిలో ఉండగా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీలో నాయకత్వ కోర్సు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

హార్వర్డ్ కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఈ నెల 25 నుంచి 30 వరకు ఈ కోర్సు జరగనుంది. ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: కేయాస్, కాన్‌ఫ్లిక్ట్, అండ్ కరేజ్’ (21వ శతాబ్దపు నాయకత్వం: అరాజకం, సంఘర్షణ, ధైర్యం) పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా తరగతులకు హాజరవడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం, హోంవర్క్ సమర్పించడం, గ్రూప్ ప్రాజెక్టులలో పాల్గొనడం వంటివి ఉంటాయి.

వాస్తవ ప్రపంచంలోని సమస్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ కోర్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఐదు ఖండాలకు చెందిన 20కి పైగా దేశాల నుంచి సీనియర్ నాయకులు, నిపుణులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ లభిస్తుంది.

పదవిలో ఉండగా హార్వర్డ్ సర్టిఫికెట్ అందుకోనున్న తొలి భారత ముఖ్యమంత్రిగా కూడా ఆయన నిలవనున్నారు. ఆధునిక నాయకత్వ విధానాలను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణ పాలనలో అమలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్