వాషింగ్టన్ డీసీలో ఘనంగా GMA గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు
వాయిస్ టుడే : వాషింగ్టన్ డీసీ | జనవరి 18 2026
GMA Sankranti celebrations in Washington DC
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రముఖ Hyderabad House రెస్టారెంట్ వేదికగా GMA – గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రవాస మున్నూరు కాపు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా మహిళలు రంగురంగుల చీరల్లో, పురుషులు పంచెలు–కుర్తాలతో హాజరై కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యతతో పాటు మున్నూరు కాపు సమాజ ఐక్యతపై GMA ప్రతినిధులు ప్రసంగించారు.
పిల్లల కోసం నిర్వహించిన సంప్రదాయ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల నృత్యాలు, జానపద గీతాలు, తెలుగు సినిమా పాటలపై డ్యాన్సులు అలరించాయి. Hyderabad House సంక్రాంతి ప్రత్యేక వంటకాలతో ఏర్పాటు చేసిన భోజనం ప్రవాసులకు స్వదేశీ పండుగ అనుభూతిని కలిగించింది.
ఈ సందర్భంగా GMA గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

త్వరలో వివిధ దేశాలలో కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే, వాషింగ్టన్ డీసీలో ఇటీవల నిర్వహించిన GMA మహాసభను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను ఈ సందర్భంగా సాలువాలతో ఘనంగా సత్కరించి, మెమంటోలు ప్రదానం చేశారు. వారి సేవలను ప్రశంసిస్తూ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వాషింగ్టన్ డీసీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మున్నూరు కాపు కుటుంబాల సహకారంతో ఘనంగా ముగిసింది.


