Wednesday, March 4, 2026

విరెడ్డి శ్రీను కొత్త చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’  ఘనంగా ప్రారంభం

- Advertisement -

విరెడ్డి శ్రీను కొత్త చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’  ఘనంగా ప్రారంభం – పూజా కార్యక్రమానికి సమంత, గోపిచంద్ మలినేని, మల్లిడి వశిష్ఠ, నందిని రెడ్డి హాజరు

Vireddy Srinu’s new film ‘Cheen Tapak Dum Dum’ has a grand opening

‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’.  అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్‌లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది.
ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్‌ డుం డుం’ తెరకెక్కనుందని టైటిల్‌ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తపు సన్నివేశానికి  సమంత క్లాప్ కొట్టారు. గోపిచంద్ మలినేని తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. మల్లిడి వశిష్ఠ కెమెరా ఆన్ చేశారు.  నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి కలిసి స్క్రిప్ట్‌ను అందజేసి చిత్రానికి శుభారంభం పలికారు. ఈ చిత్రాన్ని శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ఆయన సంస్థ విలేజ్‌ టాకీస్‌లో తెరకెక్కిస్తున్న ప్రథమ చిత్రం ఇదే కావడం విశేషం.
‘చీన్ టపాక్‌ డుం డుం’ చిత్రానికి వై.ఎన్. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా బ్రిగిడా సాగా  నటిస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమా బలమైన టీమ్‌తో ముందుకెళ్తోంది. ఆర్ట్ డైరెక్టర్‌గా ఏ.ఎస్. ప్రకాష్ పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సెంథిల్‌  కుమార్ నిర్వర్తిస్తున్నారు. పీఆర్‌  సంగీతం అందిస్తున్నారు.  తిరుపతి జావానా పాటలు రాశారు.  వీఎఫ్ఎక్స్ పనులను నిఖిల్ కొడూరు పర్యవేక్షిస్తున్నారు.  పబ్లిసిటీ డిజైన్స్‌ను శక్తి వీఎఫ్ఎక్స్ రూపొందిస్తోంది.
కథ, స్క్రీన్‌ప్లేలను దివ్య తేజస్వి, విక్రమ్ కుమార్ కె, నాగ్ ట్రైల్‌బ్లేజర్, ఏకలవ్య కలిసి అందిస్తున్నారు.  ప్రతిభావంతులు కలిసి మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో పాజిటివ్‌ వైబ్‌ ఆల్రెడీ క్రియేట్‌ అయింది. శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అందుతున్న శుభాకాంక్షలతో ‘చీన్ టపాక్‌ డుం డుం’ టీమ్‌  హ్యాపీ, ప్రామిసింగ్ జర్నీని ప్రారంభించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్