- Advertisement -
ఎంపీ వద్దిరాజు నివాసానికి మాజీ మంత్రులు, ప్రముఖుల మర్యాదపూర్వక భేటీ
వాయిస్ టుడే
Former ministers and dignitaries pay courtesy call on MP Vaddiraju’s residence

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసాన్ని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు సందర్శించారు. ఎంపీ రవిచంద్ర ఆహ్వానం మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం ఆయన నివాసానికి విచ్చేసి స్నేహపూర్వక వాతావరణంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, దావా వసంత, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


