Sunday, January 25, 2026

 రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

- Advertisement -

 రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్, జనవరి 20, (వాయిస్ టుడే )

Revanth Sarkar good news for farmers
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. దీనిలో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తుండగా.. ఇటీవల సబ్సిడీపై

యంత్రాలను కొనుగోలు చేసే విధంగా మరో పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండల

వ్యవసాయ శాఖ ద్వారా పలు యంత్రాలను సబ్సిడీలో విక్రయించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని ముమ్మరంగా

అమలు చేస్తోంది. సాగు పనుల్లో కూలీల కొరతను అధిగమించడంతో పాటు.. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేసేందుకు వీలుగా రైతులకు భారీ సబ్సిడీలను అందిస్తోంది. ఈ క్రమంలో

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండల వ్యవసాయ శాఖ ద్వారా అర్హులైన రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుత విడతలో ప్రభుత్వం ప్రధానంగా రోటోవేటర్లు, స్ప్రేయర్లపై

సబ్సిడీని ప్రకటిస్తోంది. రైతులపై ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటిపై రాయితీలు కల్పిస్తున్నారు.రోటోవేటర్.. పొలం దున్నడానికి ఉపయోగపడే రోటోవేటర్ కొనుగోలుపై 50,000 రూపాయల వరకు

సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. దీనిపై దాదాపు 50 శాతం వరకు రాయితీ కల్పిస్తారు. పురుగుల మందుల పిచికారీ కోసం ఉపయోగించే ఆధునిక హోండా కంపెనీ స్ప్రేయర్లపై 10,000 రూపాయల రాయితీ లభిస్తుంది.ఈ

పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాగు భూమి కనీసం ఒక ఎకరం అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. రోటోవేటర్ కోసం దరఖాస్తు చేసే రైతులకు

సొంతంగా ట్రాక్టర్ ఉండాలి. ఆ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రం  తప్పనిసరిగా రైతు పేరు మీద లేదా భార్య/భర్త పేరు మీద ఉండాలి.ట్రాక్టర్ ఆర్సీ కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే నమోదై ఉండాలి. కమర్షియల్ లేదా

రవాణా విభాగంలో నమోదైన ట్రాక్టర్లకు ఈ రాయితీ వర్తించదు. ఆసక్తి గల రైతులు నిర్ణీత గడువులోగా పత్రాలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పట్టాదారు భూమి పాస్ బుక్,

ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (రోటోవేటర్ దరఖాస్తుదారులకు మాత్రమే), బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొల్లాపూర్ మండల పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని

సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్ కోరారుదరఖాస్తులు సమర్పించడానికి జనవరి 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను

పరిగణనలోకి తీసుకోరు కాబట్టి.. రైతులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా సాగు ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. భవిష్యత్తులో

మరిన్ని పరికరాలను కూడా ఈ రాయితీ జాబితాలో చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్