మాజీ మంత్రి జీవన్ రెడ్డి ని
మానసిక క్షోభకు గురి చేయడం సరికాదు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
It is not right to subject former minister Jeevan Reddy to mental anguish: MP Dharmapuri Arvind
జగిత్యాల,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మానసిక క్షోభకు గురి చేయడం సరి కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పెద్దపెల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత తోపాటు పలువురు పార్టీ నాయకులతో కలిసి ఎంపి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి టప్ లీడర్ కాదని, చాలా సౌమ్యుడని, పార్టీలో సయోధ్య చేసుకోవచ్చన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వ్యవహారంపై తాను జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉందని ఎన్నికల వేళ నాకైనా, తనకైనా ప్రస్తుత సమయంలో కలవడం మంచిది కాదన్నారు. తనకు మనస్ఫూర్తిగా మాట్లాడం ఇష్టమని పార్టీలను పక్కన పెట్టాలని, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తండ్రితో సమానం అని అన్నారు. ఈ వయసులో ఆయనను హింసించడం దానంత పాపం మరొకటి లేదని అన్నారు. జీవన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం కరెక్ట్ కాదని, కాంగ్రెస్ పార్టీ మంచితనం కూడా కాదని ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు.
కోరుట్ల బీజేపీ పార్టీ లో భారీ చేరికలు
కోరుట్ల పట్టణంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ అనూప్ రావు స్వగృహంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ పార్టీ లోకి చేరారు.ఈ సంధర్భంగా
ప్రముఖ వ్యాపారవేత్త
అల్లాడి ప్రవీణ్, మచ్చ శేఖర్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, రేగుంట మహీంద్రా తోపాటు సుమారు 150 మందిని ఎంపి అర్వింద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఆనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీజేపీ పార్టీ లోకి చేరుతున్నారని ఆన్నారు.
దేశ ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్న బీజేపీ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మోదీ దేశంలోని ప్రజలందరికీ అవినీతి రహిత పాలన అందిస్తూ వారి అభ్యున్నతి కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని మోధీ చేసి చూపించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు
కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ, గ్రామాలు,పట్టణాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ తోనే సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు,జగిత్యాల జిల్లా ఇంచార్జీ శ్రీనివాస్,జిల్లా మాజీ అధ్యక్షులు మోరాపెల్లి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్,బీజేపీ రాష్ట్ర నాయకులు,డాక్టర్.రఘు,ఏలేటి నరేందర్ రెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, డాక్టర్ అనూప్ రావు ,మాజీ కౌన్సిలర్స్ పెండం గణేష్, కస్తూరి లక్ష్మీనారాయణ,మాడవేణీ నరేష్, గిన్నెల శ్రీకాంత్ ,సుదవేణి మహేష్, ఇందూరి సత్యం, జక్కుల జగదీశ్వర్, తిరుమల వాసు,ఉరుమాండ్ల చరణ్, బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బూత్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.


