Thursday, March 19, 2026

‘సింహం’ గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ

- Advertisement -

‘సింహం’ గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ
హైదరాబాద్, జనవరి 29, (వాయిస్ టుడే )

Jagruti candidates contest on ‘lion’ symbol
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. జాగృతి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ ‘సింహం’ గుర్తుపై పోటీ చేయనున్నారు. ఇక తొలిరోజు 902

నామినేషన్లు దాఖలు కాగా.. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు, స్వతంత్ర

అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి

పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వం మధ్య జరిగిన కీలక చర్చలు ఫలించాయి. రానున్న పురపాలక ఎన్నికల్లో తెలంగాణ జాగృతికి

చెందిన ఔత్సాహిక అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయించారు. కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాకుండా.. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై ఉమ్మడిగా

పోరాడాలని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి. హైదరాబాద్‌లోని ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం, కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికింది.ఇక బుధవారం నామినేషన్ల స్వీకరణ మొదటి రోజే

అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొత్తం 2,996 వార్డులకు గాను తొలిరోజే 902 నామినేషన్లు దాఖలయ్యాయి. 890 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. కొందరు అభ్యర్థులు రెండేసి సెట్ల నామపత్రాలను

సమర్పించారు. క్షేత్రస్థాయిలో తమ పట్టు నిరూపించుకునేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. మొదటి రోజు నామినేషన్ల పర్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 382 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది.

బీఆర్ఎస్ 258 నామినేషన్లతో రెండవ స్థానంలో ఉండగా, బీజేపీ నుంచి 169 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్ల స్వీకరణకు శుక్రవారమే ఆఖరి గడువు కావడంతో.. నేడు, రేపు అభ్యర్థుల తాకిడి

భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదనపు సిబ్బందితో ప్రక్రియను వేగవంతం

చేస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ పరిణామం ముఖ్యమైంది ఎందుకంటే తెలంగాణ జాగృతి సాధారణంగా సాంస్కృతిక, సామాజిక సంస్థగా పిలుస్తున్నా, ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా తన రాజకీయ బలాన్ని ప్రదర్శించాలని

చూస్తోంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన “సింహం” చిహ్నం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు పరిచయమైందని, జాగృతి కార్మికుల చేరిక దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని కవిత భావిస్తున్నారు.  ఈ

ఒప్పందం తెలంగాణ స్థానిక రాజకీయాల్లో కొత్త ఎత్తుగడకు కారణమవుతుందని అంటున్నారు.  ఈ మధ్య కవిత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీ ఏర్పాటు, విధి విధాలు, ప్రచార

వ్యూహాలపై లోతుగా చర్చించారు. ఆ పనులు ఒకవైపు సాగుతుండగానే మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి అసలైన బలాన్ని అంచనా వేసుకోవాలని కవిత భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్