Saturday, January 31, 2026

“బర్గమ్ భార్య అందంగా ఉండనే పదవి ఇచ్చానంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు”

- Advertisement -

బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుంది .. అందుకే ఆయనకు పదవి ఇచ్చా
       వివాదాస్పదంగా మారిన  ట్రంప్ చేసిన వ్యాఖ్యలు
న్యూ డిల్లీ జనవరి 30

“Trump’s sensational comments that he gave Burgum’s wife a beautiful position”
;అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. యూఎస్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా డగ్ బర్గమ్‌ను ట్రంప్ నియమించారు. అయితే బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుందని.. అందుకే ఆయనకు పదవి ఇచ్చానని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో బర్గమ్ భార్య కేథరిన్ అక్కడే ఉండటం గమనార్హం. బర్గమ్ నియామకంపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి.మాదక ద్రవ్యాల కట్టడి లక్ష్యంగా ఓ కార్యనిర్వహక ఉత్తర్వులపై గురువారం (స్థానిక కాలమాన ప్రకారం) ట్రంప్ సంతకాలు చేశారు. ఓవల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానికి సంబంధించిన వివరాలను ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా బర్గమ్‌ను అంతర్గ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించడం వెనుక గల కారణాన్ని వివరించారు. ఎన్నికల ప్రచార వీడియోలో బర్గమ్ దంపతులు గుర్రపు స్వారీ చేస్తున్న దృశ్యాన్ని చూశానని ట్రంప్ తెలిపారు. అందులో ముందుగా బర్గమ్ భార్య కేథరిన్ తన కంటపడిందని చెప్పారు. అందులో ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించారని అన్నారు. ‘ఆ వీడియో చూసి వెంటనే ఎవరు అని అడిగాను.. అది ఆయన గురించి కాదు.. ఆమె గురించే ‘ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన సహాయకులు దంపతుల వివరాలు చెప్పారని అన్నారు. అప్పుడే బర్గమ్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.“మీలా ఒక వ్యక్తికి జీవిత భాగస్వామిగా ఉండటం చాలా గొప్ప విషయం.” అని నియామకం సందర్భంగా బర్గమ్‌ను ట్రంప్ ప్రశంసించారు. అయితే బర్గమ్ వ్యాపారవేత్తగా, నార్త్ డకోటా రాష్ట్రానికి రెండుసార్లు గవర్నర్‌గా సేవలందించారు. వీటిపై బర్గమ్‌ను ట్రంప్ ప్రశంసించినప్పటికీ, ఆయన విజయాల్లో భార్య పాత్రే ఎక్కువ ఉందని పదే పదే ప్రస్తావించడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్