Sunday, February 15, 2026

భారీగా పడిపోతున్న బంగారం , వెండి ధరలు

- Advertisement -
Gold and silver prices are falling sharply
Gold and silver prices are falling sharply

Gold and silver prices are falling sharply
ముంబై,  ఫిబ్రవరి 2
దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం ధర , వెండి ధరలు భారీగా పతమవుతున్నాయి. బడ్జెట్ మరుసటిరోజు సోమవారం, ఫిబ్రవరి 2న సైతం బంగారం వెండి, ధరలు పడిపోతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఫిబ్రవరి 5, 2026 ఎక్స్పైరీ కలిగిన గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ నేడు 1,39,868 రూపాయలకు (10 గ్రాములకు) ప్రారంభమైంది. నిన్న ట్రేడింగ్ రోజ MCXలో బంగారం 1,42,510 రూపాయల వద్ద ముగిసింది.
ఫిబ్రవరి 2న ఉదయం 10:00 గంటలకు, MCXలో ఫిబ్రవరి ఎక్స్పైరీ కలిగిన బంగారం ధర రూ. 1,35,589 వద్ద ట్రేడవుతోంది. ఇది నిన్న ముగింపు ధర కంటే దాదాపు 6,900 రూపాయల తక్కువ. MCX బంగారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూ. 1,41,085  గరిష్ట స్థాయికి చేరుకుంది.MCXలో మార్చి 5, 2026 ఎక్స్పైరీ కలిగిన ఒక కేజీ వెండి రూ. 2,48,875 వద్ద ట్రేడవుతోంది. ఇది నిన్నటి ముగింపు ధర కంటే దాదాపు 16,700 రూపాయల తగ్గుదల అని గ్రహించాలి. MCX వెండి ప్రారంభ ట్రేడింగ్‌లో 2,67,501 రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈరోజు మీ నగరంలో బంగారం, వెండి ఏ ధరలకు విక్రయించబడుతున్నాయో తెలుసుకుందాం…
మీ నగరంలో బంగారం ధర (గుడ్ రిటర్న్స్ ప్రకారం)
ఢిల్లీలో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,680 రూపాయలు
22 క్యారెట్ – 1,39,050 రూపాయలు
18 క్యారెట్ – 1,13,800 రూపాయలు
హైదరాబాద్‌లో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,530 రూపాయలు
22 క్యారెట్ – 1,38,900 రూపాయలు
18 క్యారెట్ – 1,13,650 రూపాయలు
చెన్నైలో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,52,180 రూపాయలు
22 క్యారెట్ – 1,39,500 రూపాయలు
18 క్యారెట్ – 1,20,000 రూపాయలు
ముంబైలో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,530 రూపాయలు
22 క్యారెట్ – 1,38,900 రూపాయలు
18 క్యారెట్ – 1,13,650 రూపాయలు
కోల్‌కతాలో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,530 రూపాయలు
22 క్యారెట్ – 1,38,900 రూపాయలు
18 క్యారెట్ – 1,13,650 రూపాయలు
అహ్మదాబాద్‌లో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,580 రూపాయలు
22 క్యారెట్ – 1,38,950 రూపాయలు
18 క్యారెట్ – 1,13,700 రూపాయలు
లక్నోలో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,680 రూపాయలు
22 క్యారెట్ – 1,39,050 రూపాయలు
18 క్యారెట్ – 1,13,800 రూపాయలు
పాట్నాలో బంగారం ధరలు (10 గ్రాములకు)
24 క్యారెట్ – 1,51,580 రూపాయలు
22 క్యారెట్ – 1,38,950 రూపాయలు
18 క్యారెట్ – 1,13,700 రూపాయలు
కేంద్ర బడ్జెట్ 2026 ( తర్వాత బంగారం, వెండి ధరలలో భారీ పతనం కొనసాగుతోంది. బడ్జెట్ కు రెండు రోజుల ముందు సైతం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కనుక కొన్ని రోజులపాటు బంగారం, వెండి జోలికి వెళ్లకపోవడమే మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరంగా పెళ్లి లాంటి శుభకార్యాలు ఉన్నవారు అయితే బంగారం ధరలు తగ్గడంతో వారికి కొంత ఉపశమనం లభించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్