Friday, February 27, 2026

సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం :శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి

- Advertisement -

సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం
సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి
          శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి డిమాండ్
హైదరాబాద్ ఫిబ్రవరి 3

Revanth government has failed miserably in organizing the Sammakka Saralamma Jatara: Leader of Opposition in the Legislative Council Sirikonda Madhusudana Chari
సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని.. జాతర నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని సీఎం, మంత్రులు ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికారు. 15 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కనీస ఏర్పాట్లు చేయలేకపోయారన్నారు మధుసూదనా చారి. ఇదొక్క వైఫల్యం చాలు రేవంత్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తోందో చెప్పడానికి. కేసీఆర్ హయాంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరిగింది. మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో చేతలు లేవు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు.నిన్నకేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వెకిలి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేవంత్ మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయి. కేసీఆర్ ఏనాడు కూడా విచారణ ను ఎదుర్కోను అని అనలేదు ..మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మొదటి నోటీసు విచారణకు టైమ్ కోరారు.  ఎన్నో విచారణలను రెండేళ్లలో ఎదుర్కొన్నాం. దేనికి భయపడమన్నారు.కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితే.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిర స్థాయిగా ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డిది చీమ కాలంత ప్రమేయం కూడా లేదు. నిన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేష పూరిత ప్రసంగాలు వద్దని సూచించినా దాన్ని పెడచెవిన పెట్టి రేవంత్ కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని సిరికొండ మధుసూదనా చారి అన్నారు.రేవంత్ ది కుక్క తోక వంకర అనే బుద్ది. హార్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా రేవంత్ బుద్ది మారదు. గ్యారంటీల అమలు వదిలి గారడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు… కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి సొంతగా పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు…రేవంత్ తన చిల్లర బుద్దిని చాటుకుంటూ కేసీఆర్‌పై అదే పనిగా పిచ్చి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ విమర్శలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. తగిన బుద్దిచెబుతుందన్నారు మధుసూదనా చారి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్