Saturday, February 14, 2026

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్.

- Advertisement -

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్.
The songs “Nuvve Uddipo Ila” and “Nuvvele” were launched in a grand manner in the presence of Tollywood celebrities.

అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ కొరియగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరో హీరోయిన్స్ గా నటించిన
“నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పేరుతో రెండు సాంగ్స్  రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పాటలకు కెకె రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సింగర్స్ లిప్సిక, అదితి భావరాజు పాడారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ – నేను ఒక ఈవెంట్ కోసం యూఎస్ కు వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈ సాంగ్స్ హిందీ వెర్షన్ రెడీగా ఉన్నాయి. తెలుగులో చేయాలనే ఆలోచనను వారు నాతో షేర్ చేసుకున్నారు. అలా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాం. అతి తక్కువ మంది క్రూతో రెండు సాంగ్స్ ను తక్కువ టైమ్ లో కంప్లీట్ చేశాం. అన్నీ మేమే అయ్యి ఈ పాటలను చిత్రీకరించాం. ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారు ఎంతో ప్యాషనేట్ గా ఈ పాటలను ప్రొడ్యూస్ చేశారు. జయంత్ మ్యూజిక్, లిప్సిక, అదితి పాడిన తీరు, రాంబాబు గారి సాహిత్యం అన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అన్నారు.

నిర్మాత కేకే రెడ్డి మాట్లాడుతూ – మా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మంచి లవ్ ఫీల్ తో ఈ పాటలను బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు మా డైరెక్టర్ సత్య గారు. ఆయన కొరియోగ్రఫీ కూడా ఈ పాటలకు హైలైట్ అవుతుంది. లిప్సిక, అదితి ఈ పాటలను పాడిన విధానం చూస్తే వారికి గానకోకిల అని పిలవాలని అనిపిస్తోంది. జయంత్ మంచి ట్యూన్ తో కంపోజ్ చేశారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి. మీ అందరి ఆదరణ మా సాంగ్స్ కు దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

హీరోయిన్ అంకిత జాదవ్ మాట్లాడుతూ – నేను బాలీవుడ్ నుంచి వచ్చాను. అక్కడ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటాను. నేను చేసిన ఐదో మ్యూజిక్ ఆల్బమ్ ఇది. “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలను న్యూయార్క్, షికాగోలో షూటింగ్ చేశాం. అక్కడ అననుకూల వాతావరణంలో సాంగ్స్ ను కష్టపడి చిత్రీకరించాం. సత్య మాస్టర్ డైరెక్షన్ లో ఈ సాంగ్స్ చేయడం సంతోషంగా ఉంది. మా పాటలను మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ ఆర్యన్ మాట్లాడుతూ – ఈ సాంగ్స్ ను మేము హిందీలో చేశాం. తెలుగులోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇక్కడ మ్యూజిక్ లవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించాం. కానీ మా సాంగ్స్ లాంఛ్ కు ఇంతమంది పెద్దలు గెస్ట్ లుగా వచ్చాక చాలా నమ్మకం కలుగుతోంది. మా సాంగ్స్ ను తప్పకుండా తెలుగు ఆడియెన్స్ అంతా ఇష్టపడతారు అన్నారు.

నటి అషురెడ్డి మాట్లాడుతూ – “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ చాలా బాగున్నాయి. సత్య మాస్టర్ బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. హీరోయిన్ అంకితకు ఈ సాంగ్స్ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – సత్య మాస్టర్, ఆయన టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. మాతో కూడా సత్య మాస్టర్ డ్యాన్సులు చేయించారు. “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ మంచి విజువల్స్ తో ఆకట్టుకుంటున్నాయి. చిన్న టీమ్ తీసుకుని ఈ పాటలను ఇంత బాగా తెరకెక్కించారు సత్య మాస్టర్. ఆయన కష్టం ఈ పాటలో తెలుస్తోంది. సత్య మాస్టర్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నా. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మంచి పొజిషన్ లో ఉందిప్పుడు. మా చిన్నప్పుడు కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ ఎంజాయ్ చేసేవాళ్లం. కథలో మాత్రమే ఫిట్ అయ్యే సాంగ్స్ మేము రూపొందిస్తాం. కానీ ఇండిపెండెంట్ ఆల్బమ్ లో ఆ పాట కోసం ఒక థీమ్ క్రియేట్ చేస్తారు. ఈ సాంగ్స్ ఈ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి అన్నారు

నటీనటులు – అంకిత జాదవ్, రోహిత్ భోగ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్