Wednesday, February 11, 2026

శివకుమార్ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ?

- Advertisement -

శివకుమార్ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ?
బెంగళూరు, ఫిబ్రవరి 11

Is the time fixed for Shivakumar’s coronation?
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటివరకూ తెర వెనుక సాగిన సీఎం మార్పు చర్చలు ఇప్పుడు బాహాటంగా రోడ్డుపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టాలంటూ ఎమ్మెల్యేలు బహిరంగంగా డిమాండ్ చేయడం కన్నడ రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టిస్తోంది. తాజా రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుస్సేన్, చెన్నరాజ్ హట్టిహోలి. వీళ్లిద్దరూ డీకేకు కేవలం మద్దతు తెలపడమే కాకుండా, హైకమాండ్ ముందున్న లెక్కలను కూడా బయటపెట్టారు.పార్టీ కోసం రక్తం చిందించిన డీకేకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఇప్పటికే 80 నుండి 90 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. దీనికి మరో ఎమ్మెల్యే చెన్నరాజ్ హట్టిహోలి మరింత బలాన్ని చేకూర్చారు. “80 మంది కాదు, కాంగ్రెస్ నుంచి గెలిచిన మొత్తం 136 మంది ఎమ్మెల్యేలూ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు” అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసినవి కావని, సిద్ధరామయ్య క్యాంప్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2023 మేలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఈ సీటుపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం పెద్ద యుద్ధమే జరిగింది. అప్పట్లో ఢిల్లీ పెద్దలు కుదిర్చిన ’30 నెలల ఫార్ములా’ అంటే రెండున్నరేళ్ల ఒప్పందం ఇప్పుడు డీకే వర్గానికి అస్త్రంగా మారింది. ఆ గడువు ముగియడంతోనే, ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ గళాన్ని పెంచారు.సాధారణంగా ఏ పార్టీలోనైనా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుంది. కానీ, డీకే శివకుమార్ అనుచరులు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే దీని వెనుక బలమైన స్కెచ్ ఉంది. సిద్ధరామయ్య ప్రజాకర్షణ ముందు డీకే వెనుకబడిపోకుండా, ఎమ్మెల్యేల బలం తనకే ఉందని నిరూపించుకోవడం దీని వెనుక ఉద్దేశం. సిద్ధరామయ్య తన ‘అహింద’ ఓటు బ్యాంకుతో పట్టు బిగిస్తుంటే, డీకే తన ‘ఒక్కలిగ’ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను ఏకం చేస్తున్నారు. సిద్ధరామయ్య చుట్టూ ముదురుతున్న ముడా కేసు దర్యాప్తును ఆసరాగా చేసుకుని, నైతికత పేరుతో పదవిని బదిలీ చేయాలని కోరడం కూడా దీని వెనుక వ్యూహం కావచ్చు.ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే అధిష్టానం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సిద్ధరామయ్యను తప్పిస్తే వెనుకబడిన వర్గాలు ఏమౌతాయి? డీకేకు అవకాశం ఇవ్వకపోతే పార్టీకి ఆర్థిక బలం, ట్రబుల్ షూటింగ్ నెరవేరుతుందా? అనే సంకటంలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు.మొత్తానికి ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కేవలం ఊహాగానం కాదు, ఒక కార్యాచరణ అని స్పష్టం చేస్తోంది. డీకే శివకుమార్ వ్యూహాత్మకంగా తన అనుచరుల ద్వారా పావులు కదుపుతున్నారు. త్వరలోనే తనకు పట్టాభిషేకం ఖాయమనే ఆలోచనలో డీకే ఉన్నారు. ఆయన అనుచరుల తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. హైకమాండ్ పైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా తమ పంచాన్ని నెగ్గించుకోవాలనుకుంటున్నారు. మరి సిద్ధరామయ్య ఈ ఎమ్మెల్యేల అస్త్రం నుండి తన కుర్చీని ఎలా కాపాడుకుంటారో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్