Sunday, March 22, 2026

కేసీఆర్ ది రుద్రమ జాతి

- Advertisement -

కేసీఆర్ ది రుద్రమ జాతి
హైదరాబాద్, ఫిబ్రవరి  17

KCR the Rudrama Jati
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రాణీ రుద్రమ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తాము ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్‌ను తూలనాడుతూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతి గురించి అడుగుతున్నారని, కానీ తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు. కానీ సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్‌ది ఏ జాతి, ఎవరికి జాతిపిత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో తెలంగాణ వాదుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతులు ఉన్నాయని అన్నారు.”సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు. నీతి తెలియదు. లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లకు వెళ్లిన వారికి, తుపాకీలకు ఎదురొడ్డి నిలబడ్డ వారికి జాతి అంటే, జాతి అస్థిత్వం అంటే ఏమిటో తెలుసు. ఉద్యమకారుల పైకి తుపాకులు తీసుకెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎలా తెలుస్తుంది. రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే ఆత్మాభిమానం అనేది ఎక్కడైనా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏమిటో, జాతి చరిత్ర అంటే ఏమిటో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇవ్వడానికే భయపడేవారికి, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు” అని కేటీఆర్ ధ్వజమెత్తారు.”కొందరు అడుగుతున్నారు నీది ఏ జాతి అని. ఏ జాతికి జాతి పిత అని అడుగుతున్నారు. వారికి నేను సమాధానం చెబుతున్నాను. ఏ జాతి అనే అల్పుడికి నేను చెబుతున్నాను. రాజ్యతంత్రం నడిపిన రుద్రమ జాతి మాది. జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురంభీం, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క, సారక్క, కోటల మీద జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న, భూస్వాముల దోపిడి మీద కొట్లాడిన దొడ్డి కొమురయ్య, బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తుర్రెబాజ్ ఖాన్, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళేజీ, నా తెలంగాణ కోటి రతనాల అన్న దాశరథి, విద్యార్థి అమరవీరుల జాతి మాది” అని కేటీఆర్ ఉద్ఘాటించారు.
హ్యాపీ బర్తడే తాతయ్య
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన తాత గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ భావోద్వేగభరిత పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాతామనవడి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ అద్భుతంగా ఆవిష్కరించింది.
“పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్యా…
మీరు ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. అయినా, నాపై మాత్రం ఎనలేని ప్రేమను, ఆనందాన్ని కురిపించారు. నేను బాగుండాలనే మీ జీవితాన్ని గడిపారు. మీరు బాగుండేలా చూసుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని మాటిస్తున్నాను.
ఇది చాలా కష్టమైన లక్ష్యమని నాకు తెలుసు. కానీ, మీలాగే నిజాయతీగా, దయతో, ధర్మంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను…” అంటూ హిమాన్షు ట్వీట్ చేశాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్