జర్నలిస్టులు సామజిక బాధ్యతతో పనిచేయాలి.
టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మీడియా డైరీ ఆవిష్కరణ సభలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
Journalists should work with social responsibility.
* శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (వాయిస్ టుడే): జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి యూనిట్ పాత్ర ప్రశంసనియమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు నాంపల్లి లోని మీడియా అకాడమీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే రూపొందించిన రంగారెడ్డి జిల్లా మీడియా డైరీని రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సలీమ్, సత్యనారాయణలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద భీమా కల్పించటంతో పాటు, నియోజకవర్గాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించటం గొప్ప విషయం అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో మృతి చెందిన జర్నలిస్ట్ రాములు కుటుంబానికి అండగా యూనియన్ నిలబడటం మంచి పరిణామం అన్నారు.జిల్లాలో చనిపోయిన జర్నలిస్టుల జాబితా ఇవ్వాలని వారి కుటుంబాలకు అకాడమీ ద్వారా సహాయం అందిస్తాం అన్నారు. అదేవిదంగా మృతి చెందిన జర్నలిస్ట్ ల భార్య లకు 5 సంవత్సరాల వరకు 3 వేల రూపాయల పెన్షన్ తో పాటు, 10 వ తరగతి లోపు చదివే పిల్లలకు ప్రతి నెల ఒక వేయి రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు.విలేకరులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని, అది కాపాడుతూ సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు.అదేవిదంగా జర్నలిస్టులు ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. జిల్లా సమగ్ర సమాచారంతో డైరీని రూపొందించిన రంగారెడ్డి జిల్లా శాఖను శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.మీడియా అకాడమీ ద్వారా రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు శిక్షణ కుడా ఇవ్వటం జరిగిందన్నారు.రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజే -ఐజేయూ మాత్రమే అని అన్నారు.రంగారెడ్డి జిల్లాలో విద్య, వైద్య పరంగా యూనియన్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.నూతన డైరీ ఆవిష్కరణ సందర్బంగా జిల్లా జర్నలిస్ట్ లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ షాబాద్ లో మృతి చెందిన జర్నలిస్ట్ రాములు కుటుంబానికి 8 లక్షల సహాయం అందించటం జరిగిందన్నారు. జిల్లా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం డి సలీమ్ పాషా మాట్లాడుతూ జిల్లా సమగ్ర సమాచారంతో రంగారెడ్డి జిల్లా మీడియా డైరీ 2026 ను రూపొందించటం జరిగిందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ సహకారంతో జిల్లా జర్నలిస్టు లకు రెండు రోజుల శిక్షణా తరగతులు విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అదేవిదంగా రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ సూచనల మేరకు జిల్లా జర్నలిస్టులకు పలు నియోజకవర్గాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు, రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేస్తామన్నారు.ఈ సందర్బంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ లను శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రవీణ్, స్టాఫ్ రిపోర్టర్లు జంగయ్య, ఫణింద్ర, జిల్లా ఉపాధ్యక్షులు భీమయ్య,కార్యదర్శులు ఆంజనేయులు,సూర్యనారాయణ,రమేష్, జిల్లా కోశాధికారి శశిపాల్ రెడ్డి,శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్, దామోదర్ రెడ్డి, ఎలాక్ట్రానిక్ మీడియా కోశాధికారి మధు,జిల్లా కార్యవర్గ సభ్యులు దర్శనం జంగయ్య, ఇలియాజ్,సీనియర్ రిపోర్టర్లు సుభాష్, శేఖర్,తిరుపతి రెడ్డి,శంకర్, రత్నం, యాసీన్,బస్వారాజ్, ఫరీద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



