Thursday, February 19, 2026

ఓడిపోయామని అధైర్యం వద్దు. కౌన్సిలర్లతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది.

- Advertisement -

ఓడిపోయామని అధైర్యం వద్దు.
కౌన్సిలర్లతో సమానంగా ప్రాధాన్యత ఉంటుంది.

ఎమ్మెల్యే మేఘారెడ్డి, డిసిసి శివసేన రెడ్డి
వనపర్తి.
Don’t be discouraged by losing.
Equal priority will be given to councilors.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరు అధైర్య పడకూడదు అని, ప్రస్తుతం గెలిచిన కౌన్సిలర్లతో పాటే మీకు ప్రాధాన్యత ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి గారు, DCC అధ్యక్షులు శివసేనరెడ్డిపేర్కొన్నారు.

బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్గా బాధ్యత లు చేపట్టిన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు సుమిత్ర ఎల్లారెడ్డి ని వారు  మున్సిపల్ కార్యాలయంలో సన్మానించి .

చైర్మన్ వైస్ చైర్మన్ బాధ్యత స్వీకరణ  కార్యక్రమంలో భాగంగా పట్టణంలో అన్ని వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఊరేగింపును నిర్వహించారు.

మొదట ఊరేగింపునకు హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి కి, DCC శివసేన రెడ్డి ను వారు గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చుతూ డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సుభాష్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కోలాహలంగా బయలుదే
మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ తరపున బి పంపింది ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరిని పెబ్బేరు పట్టణ ప్రజలు ఎంతగానో ఆదరించారనీ.దాంతో పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్గా అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా సుమిత్ర ఎల్లారెడ్డి గార్లు పదవి బాధ్యతలు చేపట్టారని వారు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి పల్లెలను పట్టణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తుందని వారు అన్నారు.

పెబ్బేరు పట్టడానికి సంబంధించిన 30 పడకల ఆసుపత్రి, రోడ్డు విస్తరణ, సంత స్థల వివాదం, సీసీ రోడ్లు, వీధిలైట్లు, లాంటి అనేక మౌలిక వసతులపై దృష్టి సారించి కేవలం సంవత్సరంలో పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు, పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, మహిళలు, కార్యకర్తలు యువకులు, పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్