Friday, February 20, 2026

త్వరలో రామ్ చరణ్, సుకుమార్ ల ప్రాజెక్టు

- Advertisement -

త్వరలో రామ్ చరణ్, సుకుమార్ ల ప్రాజెక్టు

Ram Charan and Sukumar’s project coming soon
రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ హిట్ అనేది పక్కన పెడితే – రామ్ చరణ్లోని నటుడ్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. ‘రంగస్థలం’ కంటే ‘ఆర్.ఆర్.ఆర్’ పెద్ద హిట్ అయినా.. ఇప్పటికీ ‘రంగస్థలం’ అంటేనే చరణ్ ఫ్యాన్స్ కి ఇష్టం. అందుకే చరణ్ – సుకుమార్ కాంబో మళ్లీ రిపీట్ అయితే చూడాలన్నది అభిమానుల ఆశ.. `పెద్ది ` అవ్వగానే.. చరణ్ – సుక్కుల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఇప్పటి వరకూ సుకుమర్ చరణ్కు కథేం చెప్పలేదన్న గుసగుసలు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. . ‘పెద్ది’ పనులన్నీ అయిపోయిన తరవాత రెండో కథేమిటన్నది చరణ్కి తెలుస్తుంది. ఈలోగా పూర్తి స్థాయిలో ఆ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్.‘రంగస్థలం’ సినిమా సమయంలోనూ అంతే. మొదట రామ్ చరణ్కి వేరే కథ వినిపించాడు సుకుమార్. ఆ తరవాత జరిగిన ప్రోసెస్ లో ‘రంగస్థలం’ కథ పుట్టింది. అది చరణ్కి బాగా నచ్చింది. ఈసారీ.. అదే జరగబోతోంది. కాకపోతే ఈ రెండు కథల్లో ఏది చేయాలి అనేది పూర్తిగా చరణ్ ఇష్టం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్