వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే
తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్
తాను పెట్టబోయే పార్టీలో కొత్త తరానికి అవకాశం
భవిష్యత్ లో తెలంగాణలో బిజెపి ఉండదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ ఫిబ్రవరి 19
We will come to power in the next election: Kavitha
కొత్త పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు అని.. సిద్దిపేట, బోధన్.. రెండింట్లో ఒకచోట పోటీ చేస్తానని తెలియజేశారు. మొటి చాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్ అని అన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తానని, బిఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తోందని విమర్శించారు. తాను పెట్టబోయే పార్టీ వ్యక్తులపై నడవదని.. వ్యవస్థలపై నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎపి అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడి ప్రజలకు నచ్చలేదని చెప్పారు. సినీ నటుడు చిరంజీవి పార్టీ పెట్టి మూసివేయలేదా? అని ప్రశ్నించారు. తన లైన్ లో తాను వెళ్తున్నానని.. తన ప్రయత్నం తనది అని.. తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్ అని అన్నారు. తాను పెట్టబోయే పార్టీలో కొత్త తరానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, భవిష్యత్ లో తెలంగాణలో బిజెపి ఉండదు అని కవిత పేర్కొన్నారు.



