Saturday, February 21, 2026
- Advertisement -

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తుగ్గలి,జొన్నగిరి,మద్దికేర ఎస్సైలు నరేష్,మల్లికార్జున,హరిత.

Be alert to strangers
Tuggali, Jonnagiri, Maddikera S.I. Naresh, Mallikarjuna, Haritha.

తుగ్గలి/మద్దికేర:
: ప్రస్తుతం పరిసర ప్రాంతాలలో జరుగుతున్నటువంటి దొంగతనాల పట్ల ప్రజలు మహిళలు అప్రమత్తంగా ఉండాలని తుగ్గలి ఎస్సై నరేష్,జొన్నగిరి ఎస్సై మల్లికార్జున,మద్దికేర ఎస్సై హరిత లు తెలియజేశారు.శుక్రవారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ల యందు వారు వేరువేరుగా మాట్లాడుతూ తుగ్గలి,మద్దికేర మండలాల ప్రజలకు పోలీస్ అధికారులు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు తెలియజేశారు.ఇటీవల కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్,ఇళ్ల దొంగతనాలు మరియు వాహనాల దొంగతనాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి వేళల్లో మహిళలను టార్గెట్ చేస్తూ బైక్‌లపై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు తెలియజేశారు.గత కొద్దిరోజుల క్రితం పత్తికొండ ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద మహిళా మెడలోని బంగారు గొలుసు దొంగతనం జరిగిందని,దేవనకొండ మండల పరిధిలోని తెర్నెకల్ గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన నమోదైందని, గోనగండ్ల గ్రామంలో అంగడి వద్ద మహిళా మెడలోని బంగారు గొలుసు దొంగతనం జరిగిందని,అదేవిధంగా ఆదోని పరిసర ప్రాంతంలో కూడా మహిళలపై చైన్ స్నాచింగ్ ఘటనలు నవోదయాయని ఎస్.ఐ లు తెలియజేశారు.కావున ప్రతి ఒక్కరూ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసు అధికారులు ప్రజలకు తెలియజేశారు.మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించవద్దని,వాకింగ్‌కు వెళ్లేటప్పుడు ముఖ్యంగా 40 నుండి 60 సంవత్సరాల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఊరి చివర ఉన్న ఇళ్లలో నివసించే ఒంటరి మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,అనుమానాస్పదంగా వెనుకనుంచి వస్తున్న బైక్‌లను గమనించాలని,ప్రమాదం అనిపించిన వెంటనే గట్టిగా అరచి మరియు సమీప వ్యక్తుల సహాయం కోరాలని వారు తెలియజేశారు.అదేవిధంగా ఇళ్ల భద్రత కోసం రాత్రి సమయంలో ఇళ్ల తలుపులు,కిటికీలు పూర్తిగా మూసివేయాలని,ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు వేసి వెళ్లాలని, ఎక్కువ రోజులు బయటకు వెళ్తే సమీప పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, వీలైతే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,ఇంటి వద్ద లైటింగ్ సదుపాయం ఉండేలా చూడాలని వారు తెలియజేశారు.అదేవిధంగా యువత మరియు వాహన యజమానులు బైక్/వాహనాలను రోడ్డుపై వదిలిపెట్టకుండా సురక్షిత ప్రదేశంలో పార్క్ చేయాలని, స్టీరింగ్ లాక్ లేదా డిస్క్ లాక్ తప్పనిసరిగా వాడాలని,రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు తెలియజేశారు. అదేవిధంగా బంగారం పాలిష్ చేస్తాం అని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, బ్యాంక్ అధికారులు/పోలీసులమని చెప్పి ఓటిపి అడిగితే ఇవ్వవద్దని,మీ కుటుంబ సభ్యుడు ప్రమాదంలో ఉన్నాడని చెప్పి డబ్బులు అడిగితే వెంటనే నిజానిజాలు తెలుసుకోవాలని, అత్యవసర సహాయం కోసం వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని,సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930 కు సంప్రదించాలని పోలీస్ అధికారులు ప్రజలకు తెలియజేశారు.ప్రజల సహకారం లేకుండా నేరాలను అరికట్టడం సాధ్యం కాదని, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, వాహన నంబర్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తుగ్గలి ఎస్ఐ నరేష్,జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున,మద్దికేర ఎస్సై హరిత లు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్