తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెరుపు ధర్నా  – బీసీ సబ్ ప్లాన్ తక్షణ అమలు చేయాలని డిమాండ్

- Advertisement -

తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెరుపు ధర్నా
– బీసీ సబ్ ప్లాన్ తక్షణ అమలు చేయాలని డిమాండ్

Telangana Rajyadhikari Party lightning strike
– Demand immediate implementation of BC sub plan
బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించాలి..
.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి…

బీసీలకు 42% శాతం విద్యా,ఉపాధి, ఉద్యోగ,కాంట్రాక్టుల్లో కల్పించాలి..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్.
..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లోని Gun Park వద్ద మెరుపు ధర్నా కార్యక్రమం  నిర్వహించబడింది. బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేసి, బీసీలకు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా విడుదల చేసి, ఆ నిధులను బీసీ వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న  మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ వర్గాలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ, వారికి తగిన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేసి బీసీలకు  రావాల్సిన 55వేల కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు… విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, గృహ నిర్మాణం, వృత్తి అభివృద్ధి వంటి రంగాల్లో బీసీలకు 42 శాతం అమలు చేయాలని అలా జరిగినప్పుడే బీసీలకు నిజమైన లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
పార్టీ నాయకులు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ…ప్రతి ఏడాది బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నప్పటికీ, ఆ నిధులు పూర్తిగా ఖర్చు కావడం లేదని, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఇది బీసీ వర్గాల పట్ల అన్యాయం మాత్రమే కాకుండా, వారి హక్కుల ఉల్లంఘన అని అన్నారు.
ఈ మెరుపు ధర్నాలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,విద్యార్థి సంఘం నాయకులు వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. కార్యక్రమంలో బీసీ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమానికి బీసీ సంఘాలు కూడా మద్దతునిస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టం

బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలి…55 వేల కోట్లు బీసీలకు బడ్జెట్లో కేటాయించాలి

బీసీలకు కేటాయించిన నిధులను వేరే అవసరాలకు మళ్లించకుండా, వారి అభివృద్ధికే ఖర్చు చేయాలి…

బీసీలకు 42% శాతం విద్య,ఉద్యోగ,కాంట్రాక్టుల్లో కేటాయించాలి

బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి

ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పార్టీ హెచ్చరించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular