7వికసిత్ భారత్ 2026 పోస్టర్ రిలీజ్ చేసిన
సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్
7 Central Minister Bandi Sanjay releases Vikasit Bharat 2026 poster
కరీంనగర్
వికసిద్భారత్ కరీంనగర్ జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ 2026 పోటీలకు గాను పోస్టర్ ను సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ రిలీజ్ చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఎమర్జెన్సీ పై తమ అభిప్రాయాలను ఆలోచనలను రాజ్యాంగబద్ధంగా ఏర్పడే పరిస్థితులను సవివరంగా వ్యక్తపరచాలని విద్యార్థులను ఉద్దేశించి కోరారు. వికసిద్భారత్ 2026 జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలను 18 నుండి 25 సంవత్సరాల వయసు గల యువతి యువకులకు 50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ: లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ, అనే విషయంపై మూడు నిమిషాల పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ఈ జిల్లాస్థాయి పోటీలకు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో 28 ఫిబ్రవరి 2026 న ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేవారు ముందుగా మై భారత్ పోర్టల్ లో విక సిద్ భారత్ ఈవెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నారు. టిజిసి జిటిఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ. గత సంవత్సరం మాదిరిగానే విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మేరా యువ భారత్ జిల్లా అధికారి ఎం. వెంకట రాంబాబు మాట్లాడుతూ. జిల్లా స్థాయిలో విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ జిల్లా పేరు ప్రఖ్యాతులను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేలా తమ ప్రతిభను ప్రదర్శించాలి అన్నారు. విద్యార్థులంతా నిస్సంకోచంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సి పల్స్ పి.నితిన్ పాఠక్, టి.రాజయ్య, మరియు వికసిత్ భారత్ జిల్లా స్థాయి పోటీల సమన్వయకర్త బి. ఎలిజబెత్ రాణి అధ్యాపకులు , ఎన్ఎస్ఎస్ పిఓలు శ్రీనివాస్ రెడ్డి, సత్య ప్రకాష్, డాక్టర్ కే అర్జున్, వెంకటేశ్వర్లు, రాజేందర్ రాజేష్ తదితర అధ్యాపకులు ఎన్ఎస్ ఎస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



