భద్రాద్రిలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం
సమీక్షా భేటిలో పాల్గోన్న మంత్రి పొంగులేటి
భద్రాద్రి కొత్తగూడెం
Minister Ponguleti participating in the review meeting of Sri Ramanavami wedding celebrations in Bhadradri
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వసంతపక్ష తిరు కళ్యాణ నవహాన్నిక బ్రహ్మోత్సవాలతోపాటు ఈనెల 27వ తేదీన జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం ఏర్పాటులకు సంబంధించి సమీక్ష సమావేశం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించారు..
ఈ సమీక్ష సమావేశంలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రామాలయంలో ఈనెల18వ తేదిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము మరియు పట్టాభిషేకం మహోత్సవాల కోసం ఏర్పాట్లపై అయన అధికారులను అడిగి తెలుసుకున్నారు…. దీనిలో భాగంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులకు మజ్జిగ మరియు మంచినీరు ప్యాకెట్లు అందించాలని ఆయన సూచించారు . సీతారాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు …భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళేటటువంటి రోడ్డు మార్గం గుంతలు గుంతలు గా ఉందని వాటన్నిటిని వెంటనే ఆర్ అండ్ బి శాఖ అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈసారి రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగాలని భద్రాచలం బ్రిడ్జిపై కూడా లైటింగ్ ఏర్పాట్లను చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు..
భక్తులకు లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆయన ఆదేశించారు ఆ విధంగా లడ్డూను తయారుచేసి తాజా లడ్డూను భక్తులకు అందజేయాలని మరియు లడ్డులో నాణ్యత లోపాల తలెత్తకుండా చూడాలని ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్లుకు సూచనలు చేశారు..



