షార్ట్ వీడియో పోటీల విజేతలకు వండర్లా ఉచిత కూపన్ల పంపిణీ:
సీపీ రష్మీ పెరుమాళ్
Distribution of Wonderla free coupons to winners of short video competitions: CP Rashmi Perumal
సిద్దిపేట
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన మొదటి విడత ఆన్లైన్ షార్ట్ వీడియోల పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ చేతుల మీదుగా బహుమతులు అందజేసిన విషయం తెలిసిందే.. విజేతలకు 1వ, 2వ మరియు 3వ బహుమతులతో పాటు, పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
సిద్దిపేట పోలీసులు రూపొందించిన ఈ వినూత్న కార్యక్రమానికి ఆకర్షితులైన ప్రముఖ వినోద సంస్థ వండర్లా, విజేతలకు ఉచిత ప్రవేశ కూపన్లను స్పాన్సర్ చేసింది. సీపీ సమక్షంలో ఈ కూపన్లను విజేతలకు పంపిణీ చేయడం జరిగింది.
షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0 ప్రారంభం:
మొదటి విడతకు వచ్చిన అనూహ్య స్పందనతో, ఇప్పుడు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0 ను ప్రారంభించడం జరిగింది. సమాజంలో చైతన్యం నింపేందుకు యువత, కంటెంట్ క్రియేటర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పోటీలో పాల్గొనాలని సీపీ పిలుపునిచ్చారు.
పోటీ అంశాలు: సైబర్ నేరాలపై అవగాహన,
మహిళల భద్రత మరియు వేధింపుల నిరోధం,
ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన,
ఈవ్ టీజింగ్ నిరోధం
మాదక ద్రవ్యాల నిర్మూలన,
సామాజిక బాధ్యతతో కూడిన వీడియోలను రూపొందించి, సోషల్ మీడియాలో మా అధికారిక ఖాతాలను ట్యాగ్ చేయండి. ప్రతిభావంతులకు ఆకర్షణీయమైన బహుమతులు అందించబడతాయి.



