Thursday, March 5, 2026

రాష్ట్ర మున్నూరు కాపు సంఘం (పటేల్స్) యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీ రాజ్ కుమార్ నియామకం

- Advertisement -

రాష్ట్ర మున్నూరు కాపు సంఘం (పటేల్స్) యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీ రాజ్ కుమార్ నియామకం

సికింద్రాబాద్, మార్చ్ 04 (వాయిస్ టుడే ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం (పటేల్స్) యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీ రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు. సంఘ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘ కార్యకలాపాల్లో చురుకుగా భాగస్వామ్యం చేయడం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయడం, విద్యా–ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం తన ప్రాధాన్య లక్ష్యాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కమిటీలను మరింత బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు సంఘాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవర్ అయినా, హైదరాబాద్ అధ్యక్షులు మహేందర్ కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సామాజిక న్యాయం, యువ శక్తి సద్వినియోగం కోసం శాయశక్తులా పనిచేస్తానని స్పష్టం చేశారు.

సంఘ నాయకులు మాట్లాడుతూ, రాజ్ కుమార్ నాయకత్వంలో యువ విభాగం మరింత చైతన్యవంతంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్