తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

- Advertisement -

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..
ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్

Early onset of the sun in Telangana..
Orange alert issued for six districts
తెలంగాణలో వేసవి  ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  రెండ్రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 1.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular