విడుదలకు సిద్దమయిన ఉస్తాద్ భగత్ సింగ్
Ustaad Bhagat Singh is Ready for Release
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 29 నిమిషాలుగా ఖరారైంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.వాస్తవానికి ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని మొదట భావించారు. అయితే, అదే తేదీకి రావాల్సిన ‘టాక్సిక్’ అనే మరో సినిమా వాయిదా పడటంతో, ఆ స్లాట్ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దక్కించుకుంది. దీంతో ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.



