బిగ్ బిజినెస్ లో పెద్ది
Peddi in Big Business
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ పాన్ ఇండియా చిత్రం ‘ పెద్ది ’ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విలేజ్ బ్యాక్డ్రాప్తో మాస్ ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందుతున్న ఈ సినిమాపై ముహూర్తపు షాట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ‘పెద్ది’ థియేట్రికల్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.300 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. అక్కడ సుమారు రూ.65 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి



