దివంగత పొదిల విజయలక్ష్మీకి ఘన నివాళులు ఎంపీ వద్దిరాజు

- Advertisement -

దివంగత పొదిల విజయలక్ష్మీకి ఘన నివాళులు
ఎంపీ వద్దిరాజు
ఖమ్మం

Rich Tributes Paid to the Late Podila Vijayalakshmi
— MP Vaddiraju
నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ మాతృమూర్తి విజయలక్ష్మీ శుక్రవారం దివంగతులయ్యారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు,కాపు జేఏసీ ఛైర్మన్ చందు జనార్థన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట రామారావు తదితర ప్రముఖులు శనివారం ఉదయం వారి స్వగ్రామం ముదిగొండ మండలం ఖానాపురంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.స్వర్గీయ విజయలక్ష్మీ అంతిమయాత్రలో  పార్థివదేహాన్ని ఉంచిన పాడేను రవిచంద్ర, గాంధీ, నాగేశ్వరరావు తదితర ప్రముఖులు మోసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.దివంగత విజయలక్ష్మీ భర్త దేవేందర్, కుమారుడు రవికుమార్,కుమార్తె శైలజ, వారి కుటుంబ సభ్యులను రవిచంద్ర, గాంధీ, నాగేశ్వరరావు,జనార్థన్, రామారావు, పోలీస్ అధికారులు రామోజీ రమేష్,సాధుల సారంగపాణి, ఎక్సైజ్ శాఖ అధికారి శ్యామ్, బీఆర్ఎస్ నాయకుడు బచ్చు విజయ్ కుమార్ తదితరులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular