Saturday, March 14, 2026

అమ్మే నాన్నను చంపేసింది.

- Advertisement -

అమ్మే నాన్నను చంపేసింది.
భద్రాద్రి కొత్తగూడెం

Mother killed Father.
ఒక భార్య ప్రియుడి సహాయంతో భర్తను చంపి సహజ మరణంగా చిత్రీకరించింది. నాన్నను అమ్మ, ఇంకో వ్యక్తి కలిసి చంపారని అంత్యక్రియల తరువాత కూతురు తెలపడంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసారు.
చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఎస్డీ.జాఫర్ సెంట్రింగ్ కూలీగా పని చేస్తూన్నాడు.   13 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఖతిజాను  వివాహం చేసుకున్నాడు.
దంపతులు పదేళ్లు తిప్పనపల్లిలో నివాసం ఉండి, గత మూడేళ్లుగా చింతలపూడిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు హాస్టల్లో ఉండి చదువుతుండగా, ఎనిమిదేళ్ల కూతురు వీళ్ల దగ్గరే వుంటోంది. ఈ క్రమంలో చింతలపూడి వాసి మీరాతో ఖతిజాకు వివాహేతర సంబంధం ఏర్పడడంతో, వీరి మధ్య గొడవలు జరిగి, ఆరు నెలల క్రితం దంపతులు తిప్పనపల్లికి వచ్చేసారు. గ్రామం మారినా ఖతిజా మీరాతో రహస్యంగా మాట్లాడడం గమనించి, గత పది రోజులుగా ఆమెతో జాఫర్ గొడవ పడుతున్నాడు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న జాఫర్ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుని, ప్రియుడితో కలిసి నిద్రపోతున్న సమయంలో మొహంపై దిండు పెట్టి హత్య చేసింది  ఖతిజాజ. మద్యం సేవించి కిందపడి గాయాలయ్యాయని, తెల్లరేసరికి చనిపోయాడని అందరిని నమ్మించడంతో, బంధువులు అంత్యక్రియలు పూర్తి చేసారు. తరువాత  కూతురితో మాట్లాడుతుండగా, తన తండ్రిని అమ్మ, మరో వ్యక్తి కలిసి చంపేశారని బంధువులకు తెలిపింది.
దీంతో కుటుంబసభ్యులు  ఖతిజాను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్