హుస్నాబాద్ మార్కెట్ లో మోక్కజొన్న కోనుగోలు కేంద్రం ప్రారంభం
హుస్నాబాద్
Maize Procurement Center Inaugurated at Husnabad Market
మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని రైతులు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మొక్కజొన్న కొనుగోలుపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడి రైతులు పండించిన మొక్కజొన్న అమ్మకానికి ఇబ్బంది కలగకుండా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుండి కనీస మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరగా వెంటనే స్పందించిన సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు అనుమతివ్వగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీలు, బొలిశెట్టి శివయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ, మార్క్స్ ఫెడ్ అధికారులతో కలిసి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్నల కొనుగోలు ప్రారంభించారని అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయిలో మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందరాదని ఆ ప్రకటనలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు.



