చక్రం తిప్పుతున్న కరీంనగర్ నేతలు

- Advertisement -

చక్రం తిప్పుతున్న కరీంనగర్ నేతలు
కరీంనగర్, మార్చి 21, (వాయిస్ టుడే )

Karimnagar Leaders Are Steering the Course
కరీంనగర్‌ అంటేనే ఉద్యమాల గడ్డ. నాడు భూస్వాములపై తిరుగుబాటు చేసినా.. తర్వాత రజాకార్లపై తిరగబడినా.. తొలితరం తెలంగాణ ఉద్యమమైనా… మలిదశ తెలంగాణ పోరాటమైనా.. జగిత్యాల జైత్రయాత్ర అయినా.. నక్సల్‌ ఉద్యమమైనా.. తర్వాత జరిగిన మావోయిస్టు ఉద్యమమైనా కరీనంగర్‌ వాసులు ఉండాల్సిందే. తాజాగా రాజకీయాల్లోనూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి.. దక్కుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఈ ప్రాంతం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కీలకమైన హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ 3.0 క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసినందుకు ఆయనకు దక్కిన గుర్తింపు, గౌరవంగా చెప్పొచ్చు. ఇక తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ శ్రీధర్‌బాబు కీలకమైన ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్‌ బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రిగా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సాంక్షిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.ఇక అధికాక కాంగ్రెస్‌కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు విప్‌ పదవి దక్కింది. తన పదవికి తగినట్లుగా ఆయన కార్యదక్షత చూపుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను కూడా విప్‌ పదవులు వరించాయి. దీంతో అసెంబ్లీలో కరీంనగర్‌ శక్తి మరింత పెరిగింది. ఇక మానకొండూర్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. హుజూరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఈ పదవులు మూడు పార్టీల్లో కరీనంగర్‌ జిల్లా బలాన్ని నిరూపిస్తున్నాయి.కరీంనగర్‌ ప్రాంతం రాజకీయంగా చురుకైన మట్టి కలిగి ఉంది. స్థానిక నాయకులు పార్టీలకు అంకితమై, గ్రామీణ–పట్టణ ప్రజల మద్దతుతో ఎదిగారు. బండి సంజయ్‌కు యువతలో మంచి పట్టు ఉంది. కేటీఆర్‌ టెక్నాలజీలో యువ ఉద్యోగులను ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఊపు ఇస్తూ, జిల్లాను ’పవర్‌హౌస్‌’గా మార్చుతోంది.ప్పటికే రెండున్నరేళ్ల పాలన పూర్తి కావొస్తోంది. ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్లే ఉన్నట్లు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశావహులు పదవుల కోసం కాంగ్రెస్ పెద్దలపై ప్రెజర్ పెడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు బెర్తులతో మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులు, విప్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బడ్జెట్ సెషన్ వేళ అసెంబ్లీ, శాసన మండలిలో విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అసెంబ్లీలో కొత్తగా ముగ్గురు విప్‌లకు అవకాశం కల్పించారు.
ఇద్దరు విప్‌లకు ప్రమోషన్..
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌ను విప్‌లుగా నియమించారు. శాసనమండలిలో విప్‌లు లేకపోవడంతో అద్దంకి, బల్మూర్ వెంకట్‌కు అవకాశం దక్కినప్పటికీ..శాసనసభలో మాత్రం ఆల్రెడీ ముగ్గురు విప్‌లు ఉండగా..ఆల్ ఆఫ్ సడెన్‌గా మరో ముగ్గురిని విప్‌లుగా నియమించడంపై సరికొత్త చర్చ జరుగుతోంది.గతంలో విప్‌లుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. అందులో ఇద్దరు విప్‌లకు ప్రమోషన్ లభించింది. మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం దక్కగా..రామచంద్రు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించారు. కానీ ఇంకా రామచంద్రు నాయక్ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య విప్‌లుగా ఉండగా..కొత్తగా ముగ్గురికి అవకాశం ఇచ్చారుకొత్తగా ఒకేసారి ముగ్గురికి విప్‌లుగా అవకాశం ఇవ్వడం వెనుక..ప్రభుత్వ పెద్దల ఆలోచన మరొకటి ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. ఇక మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. ఇక మును ముందు రానున్న కాలం ప్రభుత్వానికి అత్యంత కీలకం అని చెప్పొచ్చు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు వాయిస్ మరింత పెంచే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై జరిగే దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలనే ఆలోచనతో విప్‌ల సంఖ్య పెంచారనే టాక్ వినిపిస్తుంది.ఇక విప్‌లుగా పనిచేస్తున్న వారికి కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. గతంలో ఇద్దరికి ప్రమోషన్ దక్కగా..మరో ఇద్దరు కూడా ప్రమోషన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలని ఆది శ్రీనివాస్ చాలా కాలం నుంచి కోరుతున్నారు. తెలంగాణలో..ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపు బలమైన సామాజిక వర్గం కావడంతో..తమ వర్గానికి క్యాబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని..ఆ వర్గం నేతలు కూడా పార్టీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. అలాగే బీర్ల అయిలయ్య కూడా యాదవ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular