Sunday, March 22, 2026

‘కోటి రూపాయల అటెండన్స్ వివాదం

- Advertisement -

‘కోటి రూపాయల అటెండన్స్ వివాదం
హైదరాబాద్, మార్చి 21, (వాయిస్ టుడే)

The ‘One-Crore Rupee’ Attendance Controversy
సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ సభ గడప తొక్కకుండానే “అటెండెన్స్ అక్కర్లేని అసాధారణ ఉద్యోగి” గా కొత్త రికార్డు సృష్టించారు మన గులాబీ బాస్. ‘రాజ్యం పోయినా రాచరికం పోలేదు’ అన్న సామెతను నిజం చేస్తూ గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్న తీరుపై ఇప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.సామాన్యుడు ఒక్క రోజు ఆఫీస్ మానేస్తే జీతంలో కోత పడుతుంది. కానీ మన ప్రతిపక్ష నేత గారికి మాత్రం ఇప్పటి వరకు అక్షరాలా రూ. 1.06 కోట్ల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించింది. సభకు వచ్చి ప్రజా సమస్యలపై గళం ఎత్తాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, కేవలం అకౌంట్‌లో పడే మెసేజ్‌లకే పరిమితమైన ఈ ‘రాజకీయం’ చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. “కోటి రూపాయల జీతం తీసుకుంటూ కోలుకోలేని నిద్రలో ఉండటం” అంటే ఇదేనేమోనని చర్చించుకుంటున్నారు.శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ అంటూ భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం మాత్రం “మేము రాము.. మాకు ఆ విజన్ డాక్యుమెంట్లు పట్టవు” అన్నట్లుగా వ్యవహరించింది. దీనిపై రేవంత్ సెటైర్ వేశారు. ఏఐ (AI) సునామీ రాబోతోందని గవర్నర్ చెబితే, ప్రతిపక్షం మాత్రం ఇంకా పాత రికార్డులే వేస్తోంది. కనీసం విజన్ డాక్యుమెంట్ చదివారా? అంటే.. “మాకు అధికారం పోయిన దుఃఖం చదవడానికే టైమ్ సరిపోవడం లేదు” అన్నట్లుగా ఉందని ఎద్దేవాచేశాడు.నాలుగు కోట్ల మంది ప్రజలు తమ గొంతుక వినిపిస్తారని అసెంబ్లీ వైపు చూస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు మాత్రం గవర్నర్‌కు కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా రాలేదు. సభకు రాకుండా జీతం తీసుకోవడం అనేది ఒక “మాయని మచ్చ” అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అంటే విధులకు హాజరు కాకుండా జీతం తీసుకునే ఈ కొత్త ట్రెండ్‌పై ఇప్పుడు స్పెషల్ క్లాస్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం అనేది ‘కళ’ అయితే.. అందులో కేసీఆర్ గారు ‘ఆస్కార్’ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ‘కోటి రూపాయల అటెండెన్స్’ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్