ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఉద్రిక్తతలకు తెరపడినట్టేనా..!

- Advertisement -

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఉద్రిక్తతలకు తెరపడినట్టేనా..!
న్యూ డిల్లీ మార్చ్ 23

Trump Makes Key Announcement on Iran Conflict… Have Tensions Finally Come to an End?
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపిన ట్రంప్‌ తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సోమవారం ట్రుత్ సోషల్‌ పోస్ట్‌లో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు నిలిపి వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ట్రంప్ ప్రకటనతో మూడు వారాలకు పైగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడే అవకాశముంది.హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ఇరాన్‌కు 48 గంటల సమయం ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. మూడు వారాకులపైగా ఇరాన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ట్రంప్.. తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపారు.  ‘అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాల రక్షణ గురించీ చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం మొత్తం ఇరుదేశాల మధ్య పలు అంశాల మీద లోతైన చర్చలు జరుగనున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగుతున్నందున.. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన వనరులపై ఐదు రోజుల పాటు ఎలాంటి సైనికి దాడులకు పాల్పడవద్దని మా యుద్ధ విభాగానికి ఆదేశాలిచ్చాను. ఈ విషయంపై ఆసక్తి చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular