అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- Advertisement -

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Sita-Rama Wedding Ceremony Celebrated with Grandeur

Government Whip Adi Srinivas Participates as Chief Guest

రాజన్న సిరిసిల్ల మార్చి27
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ఉత్సవ కమిటీ మరియు గ్రామ ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ వేడుకకు వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ కల్యాణ మహోత్సవానికి జోగాపూర్ గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలైన ఎనగల్, రామరావుపల్లి, కిష్టంపేట గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ యువత మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తుల రాకతో జోగాపూర్ గ్రామం భక్తి పారవశ్యంమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular