వైరల్ అవుతున్న కోసింది కొయగూర
The ‘Koyagura’ (Leafy Vegetable) That Went Viral
గరివిడి లక్ష్మి సినిమా నుంచే మరో కొత్త పాట ‘కోసింది కొయగూర’ అందర్నీ ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ‘కోసింది కొయగూర’ సాంగ్లో హీరోయిన్ ఆనంది డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ . సినిమాల్లో ఎక్కువగా సైలెంట్ రోల్స్ లో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడీ సాంగ్ లో అదరగొట్టింది. చక్కగా చీరకట్టులో ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేసింది. ఈ పాటను చూసిన వారంతా ఆనంది డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఆనందిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఆనందితో పాటు మరో నటుడు రాగ్ మయూర్ ప్రజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఈ ఫోక్ సాంగ్ కు మరింత జోష్ ను అందించాయి. ‘కోసింది కొయగూర’ జానపదం సాంగ్ ను చరణ్ అర్జున్ కంపోజ్ చేశారు.



