**బెంగుళూరు ఆత్మహత్య కేసు కొత్త మలుపు – భానుచంద్ర రెడ్డి, షాజియా ఘటనలో సంచలనం

- Advertisement -

బెంగుళూరులో ఆత్మహత్య చేసుకున్న భానుచంద్ర రెడ్డి, షాజియా కేసు కొత్త మలుపు తిరిగింది.

**Bengaluru Suicide Case Takes a New Turn – Sensational Development in the Bhanuchandra Reddy-Shazia Incident**

ఇద్దరూ రెండున్నరేళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నారు, పెళ్లి విషయం షాజియా ఇంట్లో తెలియదని చెబుతున్నారు. భానుచంద్రరెడ్డి ఇంట్లో మాత్రమే ఈ పెళ్లి విషయం తెలుసు. అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో 80 లక్షల ప్యాకేజీతో భానుచంద్రరెడ్డి ఉద్యోగం చేసేవాడు. అక్కడ తీసెయ్యడంతో బెంగుళూరు వచ్చి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. షాజియా ఐబీఎం లో చేస్తోంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉంటారని చెబుతున్నారు. చనిపోయేరోజు ఆమె భర్తకు భోజనం చేశావా అని మెసేజ్ పెడితే, ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టానని రిప్లై ఇచ్చాడు. ఏడున్నరకు ఇంటికొచ్చీ బెల్ ఎంత నొక్కినా డోర్ తీయకపోవడంతో ఇరుగు పొరుగు ఫ్లాట్ వాళ్ళు వచ్చి బలవంతంగా తలుపు తీసారు. బెడ్ రూంలో అతడి మృతదేహం ఫ్యానుకు వేలాడుతోంది. టేబుల్ మీద ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఉంది. 20 నిమిషాలు మృతదేహం వద్దనే ఉన్న షాజియా లిఫ్ట్ లో 17 వ ఫ్లోర్ కి వెళ్ళి దూకి చనిపోయింది. ఉద్యోగం లేదన్న మానసిక వత్తిడి కారణంగానే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular