Saturday, April 25, 2026

ఇష్టం లేని గర్భం కొనసాగించాలని బలవంతం చేయలేము: సుప్రీంకోర్టు

- Advertisement -

ఇష్టం లేని గర్భం కొనసాగించాలని బలవంతం చేయలేము:
సుప్రీంకోర్టు
15 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు.
One cannot be forced to continue an unwanted pregnancy:
Supreme Court

ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒక మహిళను మరీ ముఖ్యంగా బాలికను బలవంతం చేయలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అలా బలవంతం చేసే హక్కూ ఏ న్యాయస్థానానికి లేదని స్పష్టంచేసింది. పుట్టబోయే బిడ్డ కంటే గర్భం కొనసాగించే విషయంలో ఆ మహిళ తీసుకునే నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇష్టం లేకుండా ఆ బాలిక తన గర్భాన్ని కొనసాగిస్తే అది ఆమె మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉండాలి. ఒక అవాంఛిత గర్భాన్ని కొనసాగించమని మహిళను ఒత్తిడి చేయడం అంటే.. ఆమె రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్