Monday, April 27, 2026

గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరత…

- Advertisement -

గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరత…
కాకినాడ, ఏప్రిల్ 27, (వాయిస్ టుడే )

Diesel shortage in the Godavari districts…
హర్మూజ్ జ‌ల‌సంధిలో ఇరాన్, అమెరికా దేశాల మ‌ధ్య‌ నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు ఏపీలోనూ డీజీల్ స‌ర‌ఫ‌రాపై ప్రభావం చూపుతున్నాయి. రోజురోజుకు ఆ దేశాల మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత ఏక్ష‌ణాన ఆయిల్ సంక్షోభం త‌లెత్తుతుందోన‌న్న భ‌యం అన్ని రంగాల్లోనూ క‌నిపిస్తోంది. ఆయిల్ డీల‌ర్లు ముంద‌స్తుగా చెల్లింపులు చేస్తేనే బంకుల‌కు డీజీల్‌, పెట్రోల్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్న‌ నిర్ణ‌యంతో అటు ఆయిల్ స‌ర‌ఫ‌రా దారులు, బంకుల య‌జ‌మానుల మ‌ధ్య‌ త‌లెత్తిన ఆర్దీక లావాదేవీల స‌మ‌స్య‌ల‌తో చాలా బంకుల్లో డీజీల్‌, పెట్రోల్ స‌ర‌ఫ‌రా కానీ ప‌రిస్థితి కనిపిస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చాలా బంకుల్లో డీజీల్ నిల్ అనే బోర్డులే ద‌ర్శ‌నం ఇచ్చాయి.. ఇది ఒకింత ఆందోళ‌న క‌లిగించే అంశంగా ప‌రిణ‌మించి ప్ర‌జ‌ల్లో పానిక్ ప‌రిస్థితిలోకి నెట్టింది. డీజీల్ కొర‌త వస్తోంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో డీజీల్ విక్ర‌యాలు జ‌రుపుతోన్న బంకుల వ‌ద్ద డ‌బ్బాలు ప‌ట్టుకుని బారులు తీరారు. భారీ వాహ‌నాలు, లారీలు, టిప్ప‌ర్లు, క‌ళాశాల బ‌స్సులు కూడా బంకుల‌కు వ‌రుస క‌ట్టాయి. మ‌రో ప‌క్క డీజీల్, పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతాయ‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో కొంద‌రు డీల‌ర్ల కావాల‌నే కృత్రిమ కొర‌త సృష్టిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.ఇదిలా ఉంటే రైతులు అవ‌స‌రానికి మంచి డ‌బ్బాల్లోనూ, ట్యాంకుల్లోనూ నింపి మ‌రీ డీజీల్ ను కొనుగోళ్లు చేస్తున్నారు. ఒక్క‌సారిగా పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరుతోన్న వాహ‌నాలు, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారంతో అధికారులు స్పందించారు.. డీజీల్ కొర‌త ప్ర‌స్తుతం లేద‌ని, ప్ర‌జ‌లు, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇస్తున్నారు.డీజీల్ కొర‌త ప్ర‌భావం వ్య‌వ‌సాయ‌, ఆక్వా, ర‌వాణా రంగాల‌పై తీవ్రంగా ప్ర‌భావం ప‌డుతుందంటున్నారు. ఇప్ప‌టికే చాలా బంకుల్లో డీజీల్ ల‌భ్య‌త లేక‌పోవ‌డంతో డీజీల్‌తో న‌డిచే వాహ‌నాలు నిలిపివేసే ప‌రిస్థితి ప‌లు చోట్ల క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ర‌బీ కోత‌లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. 95 శాతం కోత‌ల‌న్నీ వ‌రికోత యంత్రాల ద్వారానే జ‌రుగుతుండ‌గా డీజీల్ కొర‌త ప్ర‌భావం వ్య‌వ‌సాయ రంగంపై తీవ్రంగా ప‌డే అవ‌కాశం ఉంద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోప‌క్క ప‌ది రోజులపాటు రాష్ట్రంలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌ధ్యంలో రైతులు వ‌రి కోత‌ల‌ను మ‌రింత స్పీడ్ పెంచారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాకు ఆయువుప‌ట్టు అయిన ఆక్వారంగం కూడా డీజీల్ కొర‌త గ‌నుక జ‌రిగితే తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. వేస‌వి కాలం కావ‌డంతో విద్యుత్తు కోత‌లు తీవ్రంగా ఉంటాయ‌ని, జ‌న‌రేట‌ర్ల‌కు డీజీల్ వినియోగం భారీగా అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న ఆలోచ‌న‌తో చెరువుల వ‌ద్ద‌ డీజీల్ నిల్వ‌లు ఉండేలా చూసుకుంటున్నారు. బంకుల వ‌ద్ద‌ లారీలు, క‌ళాశాల బ‌స్సులు క్యూ క‌డుతుంటే డీజీల్‌తో న‌డిచే కార్లు, ఇత‌ర వాహనాల డిక్కీల్లో అద‌నంగా డ‌బ్బాలు తెచ్చుకుని మరీ డీజీల్ ప‌ట్టించుకుంటున్నారు. కొంత మంది ఆక్వా రైతులు 200 లీట‌ర్లు సామ‌ర్థ్యం ఉన్న డ‌బ్బాల్లో డీజీల్ ప‌ట్టించి ట్రాక్ట‌ర్ల‌పై త‌ర‌లించుకుపోతున్నారు.పెట్రోల్‌, డీజీల్ స‌ర‌ఫ‌రా విష‌యంలో బంకుల య‌జ‌మానులు ఆయిల్ డీల‌ర్ల‌కు ముంద‌స్తుగానే చెల్లింపులు చేయాల‌న్న నిభంద‌న‌ల కొన్ని రోజులుగా అమ‌లు చేస్తున్నారు. దీంతో కొన్ని బంకుల య‌జ‌మానులు చెల్లింపులు ఆల‌స్యంగా చేయ‌డం, కొన్ని బంకుల య‌జ‌మానులు అస‌లు ముందస్తు డిపాజిట్‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా బంకుల వ‌ద్ద డీజీల్ నిల్ బోర్డులు ఎక్క‌వగా క‌నిపిస్తున్నాయంటున్నారు. బంకుల వ‌ద్ద మాత్రం డీజీల్ నిల్ అనే బోర్డులు క‌నిపిస్తుండ‌డంతో సామాన్య ప్ర‌జ‌లు, వాహ‌న దారులు మాత్రం డీజీల్ కొర‌త వ‌స్తుంద‌న్న అనుమానంతో అవ‌స‌రం లేక‌పోయినా అవ‌స‌రానికి మించి కొనుగోళ్లు చేయడంతో గ‌త మూడు రోజులుగా తూర్పుగోదావ‌రి, అంబేడ్క‌ర్ కోన‌సీమ, కాకినాడ జిల్లాలో ప‌లు బంకుల్లో డీజీల్ నిల్ బోర్డులు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.ఆయిల్ బంకుల వ‌ద్ద త‌లెత్తుతోన్న‌ ప్యానిక్ ప‌రిస్థితులకు ప్ర‌ధాన కార‌ణం కొన్ని రోజుల పాటు డీజీల్ దొర‌క‌ద‌న్న ప్ర‌చార‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. దీని వ‌ల్ల డీజీల్ అవ‌స‌రానికి మంచి కొనుగోళ్లకు వాహ‌న దారులు ఎగ‌బ‌డుతున్నారు. పెట్రోల్ విష‌యంలో అయితే పెట్రోల్ తో న‌డిచే ద్విచ‌క్ర‌వాహ‌నాలు, లైట్ మోటారు వెహిక‌ల్ త‌మ అవ‌స‌రానికి మించి కొనుగోళ్లు చేసినా ఈ పెట్రోల్ కొర‌త ప్ర‌భావం కేవ‌లం రెండు మూడు రోజులు మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని, ఎందుకంటే వారు నింపిన పెట్రోల్ వినియోగించుకున్నాకే మ‌ళ్లీ బంకుల వ‌ద్ద‌కు వ‌స్తార‌ని, అయితే డీజీల్ విష‌యంలో మాత్రం భిన్నంగా ఉంటుందంటున్నారు. ర‌వాణా రంగంలో భారీ వాహ‌నాల‌కు ఎక్కువ‌గా డీజీల్ అవ‌స‌రం, వ్య‌వ‌సాయ‌, ఆక్వా రంగానికి భారీగా వినియోగం ఉండ‌డం వ‌ల్ల డీజీల్ కొర‌త ప్ర‌భావం ఆయా రంగాల‌పై తీవ్రంగా ప‌డుంతుంట‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది.డీజీల్ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా డీజీల్ నిల్వ‌లున్నాయ‌ని అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ తెలిపారు. డీజిల్ సరఫరాపై నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్థానిక కలెక్టరేట్‌లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు జిల్లా పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్‌ తో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు సూచనలు చేశారు. ప్రస్తుతం వరి కోతల సీజన్ మరియు ఆక్వా రంగం అవసరాల దృష్ట్యా డీజిల్ కొరత అనే మాట వినపడకుండా డిమాండ్ సప్లైలు పాటిం చాలని ఆదేశించారు. ఎవరైనా డీలర్లు ఉద్దేశ పూర్వకంగా నిల్వలను దాచినా లేదా కృత్రిమ కొరతను సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుం దనీ హెచ్చ రించారు.చమురు నిల్వలు నిండు కుంటాయనే భయంతో బంకుల వద్ద భారీగా క్యూ కట్టవద్దని వాహనదారులు తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగో లు చేయాలన్నారు. పుకార్లను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబ డతాయ న్నారు అంతర్జా తీయ ఉద్రిక్తతల సమయంలో చమురు సరఫరా లు నిలిచిపోతాయనే ప్రచారం లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఆయిల్ కంపెనీ వద్ద సరిపడా నిల్వలు అందు బాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని తెలిపారు.
=============

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్