Wednesday, April 29, 2026

 ఇవాళ టెన్త్ ఫలితాలు

- Advertisement -

 ఇవాళ టెన్త్ ఫలితాలు

10th Grade Results Today
హైదరాబాద్, ఏప్రిల్ 28 ( వాయిస్ టుడే)
తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) కార్యాలయంలో విద్యాశాఖ 10వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. . మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు తెలంగాన వ్యాప్తంగా మొత్తం 5,28,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/
ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా విడుదల చేయనున్నారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ, విద్యార్థుల పై చదువులకు ఆటంకం కలగకుండా తగిన సమయానికే ఫలితాలను సిద్ధం చేసింది. వాస్తవానికి మే తొలి వారంలో రిజల్ట్స్ విడుదల చేస్తారని ప్రచారం జరగగా.. విద్యార్థుల భవిష్యత్ కోసం త్వరగా మూల్యంకనం చేసి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ల ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచి తెలంగాన టెన్త్ క్లాస్ ఫలితాలు వాట్సాప్‌లో కూడా తెలుసుకోవచ్చు.
వాట్సాప్‌లోనే 10వ తరగతి ఫలితాలు చెక్ చేసుకోండి.
– ముందుగా 8096958096 ఫోన్ నెంబర్ మీ ఫోన్లో సేవల్ చేసుకోండి.
– తరువాత 8096958096కి మీ వాట్సాప్‌లో Hi అని పంపాలి
– తర్వాత  SSC Results టైప్ చేసి హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
– మీ వివరాలు, హాల్ టికెట్ సరిగ్గా ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్‌పై ఫలితం కనిపిస్తుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్