Friday, May 1, 2026

రాష్ట్ర సేన నుంచి రక్షణ సేనగా మార్పు

- Advertisement -

రాష్ట్ర సేన నుంచి రక్షణ సేనగా మార్పు
గుడ్ న్యూస్ చెప్పిన సీఈసీ

Transition from State Force to Protection Force
CEC Delivers Good News
హైదరాబాద్, ఏప్రిల్ 30, ( వాయిస్ టుడే)
కొత్త పార్టీతో ప్రజల పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధమైన కవితకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్ర సేనను కాస్త రక్షణ సేనగా మార్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రక్రియ పూర్తి చేసి అంగీకార పత్రాలను కవితకు అందజేశారు. గతంలో కవిత ఇచ్చిన ఆప్షన్స్‌లో ఇది కూడా ఉండటంతో ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. భారత రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్సీ కవిత TRS పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ధ్యేయంగా సామాజిక తెలంగాణ ఆకాంక్షల కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనికి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రాదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. పెద్ద హిస్టరీ ఉన్న పార్టీలు పేర్లు పెట్టుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వదని కూడా ప్రచారం చేశారు. కానీ వారికి షాక్ ఇస్తూ ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌కు గుర్తింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుకునే ఉంటే అనుమతి వచ్చేది కాదేమో కానీ ఆమె తెలంగాణ రాష్ట్ర సేన అని తెలివిగా ఇంగ్లీష్‌లో టీఆర్‌ఎస్ అని వచ్చేలా పేరును డిజైన్ చేశారు.పార్టీకి ఈసీ గుర్తించడంపై ఆనందం వ్యక్తం చేసిన కవిత టీఆర్ఎస్ నాకు రాసి పెట్టిందేమో అని కామెంట్ చేశారు. “*తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)* కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. TRS నాకు రాసిపెట్టుండేమో” అని వెల్లడించారు. జనవరిలో పార్టీ కోసం కవిత దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగామ ప్రజాశక్తి పేరుతో పార్టీకి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీకి విజప్తి చేశారు. అయితే మొన్నటి వరకు వీటిలో దేనికి కూడా ఆమోదం రాకపోయేసరికి మంచి ముహూర్తం ఉందని టీఆర్‌ఎస్ పేరుతో వస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈసీ ఆమె ఇచ్చిన ఐదు ఆప్షన్స్‌లో తెలంగాణ సేనకు అంగీకారం తెలిపింది. ఆమె అనుకున్నట్టుగానే టీఆర్‌ఎస్ కలిసి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్