Friday, May 1, 2026

 పిల్లల కోసం సర్దుకుపోతా, టెకీ సీతారాం తండ్రి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

 పిల్లల కోసం సర్దుకుపోతా,
టెకీ సీతారాం తండ్రి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 1, (వాయిస్ టుడే)

“I Will Compromise for the Sake of the Children”: Techie Sitaram’s Father Makes Sensational Remarks
తన కొడుకు మరణానికి అతడి భార్యకు వేరే వ్యక్తులతో సంబంధాలు ఉండటమే కారణమని టెకీ సీతారాం తండ్రి ఆరోపించారు. సీతారాం భార్య బాయ్ ఫ్రెండ్‌తో చనువుగా ఉండగా వీడియోలు తీసుకుందని.. ఆ వీడియోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపించి, అతడితో సోషల్ మీడియాలో పెట్టించిందని ఆయన ఆరోపించారు. తన కొడుకు పెన్ డ్రైవ్‌లో వీడియోలను దాచాడని ఆయన తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సీతారాం భార్యతోపాటు మరో వ్యక్తి అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం రెడ్డి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సీతారాం సూసైడ్ నోట్‌లో రాసిన విషయాలు విస్మయం గొలుపుతున్నాయి. సీతారాం మరణం గురించి ఆయన తండ్రి వెంకటేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కోడలికి వేరే వ్యక్తులతో సంబంధం ఉండటంతోనే తన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన వాపోయారు. తాము బతికి ఉన్న చనిపోయినట్లేనని తన బాధను వ్యక్తం చేశారు.‘‘బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా మెలుగుతున్న సమయంలో ఆ అమ్మాయి వీడియో తీసుకుంది. ఆ వీడియోను బాయ్‌ఫ్రెండ్‌కు ఫార్వార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టించింది. ఈ విషయం నాకు రెండు రోజుల తర్వాత మా వియ్యంకుడి వాళ్ల అన్నయ్య చెప్పారు. నా కొడుకు మాత్రం మాతో ఈ విషయం చెప్పలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ల వాళ్లు తీసుకెళ్లారు. మా అబ్బాయి మా దగ్గరికి (మార్కాపురం) వచ్చేశాడు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మాట్లాడుకుందాం అని అమ్మాయి తరఫు వాళ్లు ఫోన్ చేశారు. దీంతో మార్కాపురం రమ్మని చెప్పాను. ‘మా అమ్మాయి తప్పు చేసింది, అవతలి వ్యక్తులను (బాయ్ ఫ్రెండ్‌లను) వదిలిపెట్టబోమని’ వారు మాతో చెప్పారు. విడాకులు కావాలని మేం అడగ్గా.. ఇక మీదట మా అమ్మాయి పొరపాటు చేయదని ఆమె తండ్రి, పెదనాన్న హామీ ఇచ్చారు. మా అమ్మాయికి సెల్‌ఫోన్ ఇవ్వం, ఓ మూలన పడి ఉంటుందన్నారు. అయినా సరే కుదరదని మేం చెప్పాం. దీంతో వాళ్లు వెళ్లిపోయారు’’ అని సీతారాం తండ్రి వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.‘మా అబ్బాయి 70 రోజులపాటు మార్కాపురంలో మాతోనే ఉన్నాడు. నెల రోజులు పోయాక.. అమ్మాయి తరఫు వాళ్లు మళ్లీ మాతో టచ్‌లోకి వచ్చారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి.. తన భార్యతో సర్దుకుపోతానని నా కొడుకు చెప్పాడు. తనతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదని వాడితో నేను చెప్పాను. అయినా సరే నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందని వెళ్లిపోయాడు. తన భార్య ప్రయివేట్ వీడియోలు చూసిన తర్వాత కూడా నా కొడుకు ఐదు నెలలు బతికాడంటే, అతడికి ఎంతో ధైర్యం ఉంది. నా కొడుకు మాత్రమే చనిపోలేదు. బతికి ఉన్నా మేం చనిపోయినట్లే. నా కొడుకు ఖననం సమయంలో వాడి పిల్లలను అమ్మాయి తరఫు వారు శ్మశానానికి తీసుకొచ్చి, అట్నుంచి అటే తీసుకెళ్లారు. తన భార్య వీడియోలు, ఇతర ఆధారాలను మా అబ్బాయి పెన్‌డ్రైవ్‌లో ఉంచి నాకు పంపించాడు’’ అని సీతారాం రెడ్డి తండ్రి తెలిపారు. తన కొడుకు అత్తామామ, బామ్మర్ది, సీతారాం టీమ్ లీడర్ కలిసి సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేశారని వెంకటేశ్వర రెడ్డి ఆరోపించారు.జనవరి 24న సీతారాం బయటకు వెళ్లినప్పుడు అతడి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, మళ్లీ తిరిగి రాలేదు. దీంతో సీతారాం అదే రోజు బాచుపల్లి పోలీసు స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.ఫిబ్రవరి 8న సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వాట్సాప్ స్టేటస్ చూసిన బంధువులు హుస్సేన్ సాగర్, పరిసర ప్రాంతాల్లో వెతికారు. మరుసటి రోజు హుస్సేన్ సాగర్ అతడి మృతదేహం లభ్యమైంది. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి అతడి భార్యే కారణమని సీతారాం తండ్రి వెంకటేశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘2025 సెప్టెంబర్ 19న ఇన్‌స్టాగ్రామ్‌లో వెంకట రమణా రెడ్డి పోస్టు చేసిన ప్రైవేట్ వీడియోలను చూశాక.. తన భార్యకు అతడితో ఎఫైర్ ఉందని నా కొడుక్కి తెలిసింది’ అని వెంకటేశ్వర రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.గతంలో వెంకట రమణా రెడ్డిపై సీతారాం, ఆయన భార్య శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతణ్ని అరెస్ట్ చేశారని బాచుపల్లి పోలీసులు తెలపడం గమనార్హం. ఆ తర్వాత సీతారాం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చజెప్పడంతో 2025 నవంబర్‌లో తిరిగి భర్తతో కలిసి ఉండటానికి వచ్చింది. కానీ తర్వాత ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం సీతారాంను బాధించింది. ‘నా కోడలు, వెంకట రమణా రెడ్డి సహా, ఇతరుల ప్రవర్తన నచ్చకపోవడంతో నా కొడుకు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వెంకటేశ్వర రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.వెంకటేశ్వర రెడ్డి ఫిర్యాదుతో లేక్ పోలీసులు ఫిబ్రవరి 9న బీఎన్ఎస్‌లోని సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. తర్వాత దాన్ని బాచుపల్లి పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. మార్చి నెలలో బాచుపల్లి పోలీసులు అదే సెక్షన్ కింద కేసును తిరిగి నమోదు చేశారు. సీతారాం భార్యతోపాటు వెంకట రమణారెడ్డిని ఏప్రిల్ 21న బాచుపల్లిలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు బాచుపల్లి ఇన్స్‌పెక్టర్ సి.సతీష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్