కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ
The Congress is, by definition, a pro-farmer government.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ, ధనసరి సీతక్క ప్రారంభించారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. ఎన్నికల వాగ్ధానంగా నాడు ఏఐసిసి అగ్ర నాయకులు, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రైతు పక్షపాతి ప్రభుత్వంగా పరిపాలనందిస్తున్నాం.
రూ.2 లక్షల పంట రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా దశాబ్దాల భూ సమస్యల పరిష్కారానికి “భూభారతి” వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు.
రైతు వారోత్సవాల్లో బాగంగా మే 5, 6, 7 తేదీలలో నిర్వహిస్తున్న ఈ రైతు మేళాలో రైతులకు అవసరమైన యాంత్రిక పరికరాలను సబ్సీడీపై అందిస్తున్నాం. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నాను. రైతు మేళా వేదికగా భూసార పరీక్షలు నిర్వహించిన అధికారులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. మద్ధతు ధర అడిగినందుకు ఖమ్మంలో రైతన్నలకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు రైతన్నల మీద కపట ప్రేమ వలకబోస్తున్నారు. గత ప్రభుత్వం 10 ఏండ్లు పాలించి రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల అందించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై కమీషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి అప్పగించి 9 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపి–బీఆర్ఎస్ మధ్య లాలూచి రాజకీయాలకు అద్దం పడుతున్నాయని అన్నారు.
రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపి ఎంపీలు చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై CBI ద్వారా సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే మీ నిజాయితి ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు. .



