Saturday, May 9, 2026

‘అమరం’ మూవీ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్  

- Advertisement -

‘అమరం’ మూవీ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్  

‘Amaram’ Movie: Intense, Action-Packed Teaser Released

తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం అమరం, తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఓ ట్రైబల్ స్మగ్లర్‌, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది.
ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది.ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది.వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు.
దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ప్రత్యేక యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాంబేకు చెందిన మార్షల్ ఆర్ట్స్ టీమ్ సహకారంతో మాస్టర్ మిరాకిల్ మైఖేల్ ఆధ్వర్యంలో మూడు భారీ యాక్షన్ బ్లాక్స్ తెరకెక్కించారు. లోతైన ప్రేమకథను సిట్యువేషనల్ యాక్షన్‌తో మేళవించి చిత్రాన్ని రూపొందించారు.
తేజేష్ తొలి సినిమాకే  అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొడైకెనాల్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం డాల్ఫిన్ నోస్ వద్ద తెరకెక్కించిన ఒక కీలక సన్నివేశాన్ని ఆయన సింగిల్ టేక్‌లో పూర్తి చేయడం విశేషం.
హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించగా, నాగినీడు, సాయి ధీనా, జార్జ్ మరియన్, సురేష్ చంద్ర మీనన్, హరీష్ పరాడి తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తిరువరుల్ కృష్ణన్ గతంలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ వద్ద అసోసియేట్‌గా పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, ‘వడచెన్నై’, ‘అసురన్’ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన రామర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. కొత్త సినిమాటోగ్రాఫర్ భరత్ విజువల్స్ అందించారు.ఈ చిత్రంలో ఐదు పాటలు ఉండగా, వాటికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బూపతి మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఆయన రాజు సుందరం, ప్రభుదేవా మాస్టర్లకు సన్నిహిత సహాయకుడిగా మంచి గుర్తింపు పొందారు.కొడైకెనాల్‌లో ఆర్ట్ డైరెక్టర్ జనా సర్ రూపొందించిన భారీ సెట్‌లో ఓ ప్రత్యేక ఫోక్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో కేరళకు చెందిన 60 మంది డ్యాన్సర్లు పాల్గొనడం విశేషం. మిక్కీ జే మేయర్ అందించిన ఈ ఫోక్ నెంబర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.వేర్వేరు సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఓ జంట అనుకోని పరిస్థితుల్లో చేసే ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలతో సినిమా ఉత్కంఠభరితంగా సాగనుంది.
తారాగణం – తేజేష్ రాజన్, ఐరా అగర్వాల్, జార్జ్ మరియన్, నాగినీడు, సాయి ధీనా, హరీష్ పరడి, సురేష్ చంద్ర మీనన్, కల్కి రాజన్, వాసుదేవ్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్