Saturday, May 9, 2026

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ!

- Advertisement -

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ!
Filling of Nominated Posts in Telangana!
హైదరాబాద్, మే 6

తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుండి పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఎన్నాళ్లగానో ఆశావహులు ఎదురుచూస్తున్న ఈ పదవులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోక్షం కల్పించింది. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలకు సంబంధించిన వివరాలను టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ ఈ పదవుల పంపకం జరిగినట్లు కనిపిస్తోంది.ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాబితాలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులు (BC), అగ్రవర్ణాలలోని వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో రాజకీయ బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.రాష్ట్రంలో అత్యంత కీలకమైన తెలంగాణ తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా ప్రొ.వెంకటనారాయణ నియమితులయ్యారు. అలాగే, న్యాయపరమైన, పాలనాపరమైన అంశాలతో ముడిపడి ఉన్న తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా సూదిని రామిరెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ట్రైబ్యునల్‌లో సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్‌లకు అవకాశం దక్కింది.ఇక వివిధ కులాల కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ : బస్వరాజ్ శ్రీనివాస్
మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ ఛైర్మన్ : బొమ్మ శ్రీరామ్
యాదవ సహకార కార్పొరేషన్ ఛైర్మన్ : ఎం.రఘునాథ్ యాదవ్
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ : బండి రమేష్
వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ : జువ్వాది నర్సింగ్‌రావు
పద్మశాలి సహకార కార్పొరేషన్ ఛైర్మన్ : గూడురు శ్రీనివాస్
గీత కార్మికులు, చేనేత, వాషర్‌మెన్ వంటి వృత్తి గిరాకీ ఉన్న సామాజిక వర్గాలకు కూడా ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది.
గీతకార్మికుల కార్పొరేషన్ ఛైర్మన్ : మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్
చేనేత అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ : దూదెం వెంకటరమణ
వాషర్‌మెన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ : దాసరిరాజు అజయ్ కుమార్
వడ్డెర సహకార కార్పొరేషన్ ఛైర్మన్ : గుంజ రేణుక నారాయణ
వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ ఛైర్మన్ : గట్టు తిమ్మప్ప
వీటితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ ఛైర్మన్‌గా కొల్లె సరిత, లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరికొన్ని విభాగాల్లో.. పెరిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్‌గా దొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ ఛైర్మన్‌గా సంగా వెంకటరాజం, భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్‌గా సీహెచ్ బాలరాజు నియమితులయ్యారు.చాలా కాలంగా పదవుల కోసం నిరీక్షిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తిని తొలగించేందుకు ఈ భర్తీ ప్రక్రియ దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం, పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తూ ఈ జాబితాను సిద్ధం చేశారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, ఈ నామినేటెడ్ పదవుల భర్తీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలి ఉన్న మరికొన్ని పదవులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఈ నియామకాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్