కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసు ముగ్గురు నిందితుల అరెస్ట్

- Advertisement -

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసు
ముగ్గురు నిందితుల అరెస్ట్
కరీంనగర్

Karimnagar PMJ Jewellery Case:
Three Accused Arrested
కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దొపిడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు సీజ్ చేసారు. దొంగలు నగలు దోచుకొని బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్కు పరారైయినట్లు గుర్తించారు. ఈ దోపిడీలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి మొత్తం రూ.82,02,000/- విలువైన ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటనలో నలుగురు స్టాఫ్ గాయపడ్డారు.  రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ను బుధవారం  సాయంత్రం 4:00 గంటల సమయంలో వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్ @ ప్రద్యుమన్ మరియు మెహతాబ్ ఖాన్లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై తీసుకువచ్చారు. బీహార్కు చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోద్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్గా గుర్తించారు పోలీసులు.  చోరీలో ఐదుగురు దొంగలు పాల్గోన్నారు.  ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్  అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చోరీలో 13 మంది పాల్గొన్నట్లు గుర్తించారు.  గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్, 10 మంది నిందితులు ఇంకా దొరకలేదు. ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు మరియు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
సుభోద్ సింగ్ అనుచరుల సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి రైలులో చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు 02-05-2026 న గడ్‌చందూర్ పరిసరాల్లో ఆరు పిస్టల్స్ మరియు మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం రఘునాథ్ కర్మాకర్ ఆయుధాలతో ధర్మపురికి తిరిగి వచ్చాడు.
03-05-2026న ఉదయం ఐదుగురు నిందితులు ధర్మపురిలో వారు ఉన్న లాడ్జ్ ఖాళీ చేసి రెండు బైక్‌ల పై బయలుదేరారు. బ్యాగులను కొండ ప్రాంతంలో దాచిపెట్టి, అక్కడే వారి బైక్ నంబర్ ప్లేట్లు మార్చి, వెలిచాల ఎక్స్ రోడ్ వద్దకి చేరుకొని అక్కడ టిఫిన్ చేసి, దోపిడీ ప్రణాళికను మరోసారి చర్చించారు.
తరువాత ఉదయం 10:50 గంటలకు PMJ జ్యువెలరీ షాప్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం రాధే @ అభయ్ కస్టమర్‌లా షాప్‌లోకి వెళ్లి పరిస్థితిని గమనించాడు. రాధే మెస్సేజ్ ఇచ్చిన తర్వాత మిగతా నిందితులు లోపలికి ప్రవేశించి సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారు. నగలు దోచుకొనే సమయంలో  స్టాఫ్ ప్రతిఘతించారు. దాంతో నిందితులు వారి వద్ద ఉన్న ఆయుదాలతో స్టాఫ్ పై కాల్పులు జరిపారు.
నిందితులు షాప్ నుండి పారిపోతూ వారు షాపులో దోచుకున్న ఒక ఆభరణాల బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు. ఆందోళనలో మరో బ్యాగ్‌ను షాప్‌లోనే వదిలివేశారు. ముందుగా నిర్ణయించిన మార్గంలో ధర్మపురికి చేరుకున్నారు.

సనోజ్, రాధే @ అభయ్, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్‌ను వదిలి నడుచుకుంటూ నది దాటి మంచిర్యాల నుంచి రైలులో పరారయ్యారు.

మరోవైపు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ మరియు మిశ్రా ఆభరణాల బ్యాగ్‌తో అపాచీ బైక్‌పై గుండాల అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తెలుపు రంగు క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్ మరియు బైక్ అప్పగించి సమీప రైల్వే స్టేషన్ ద్వారా బీహార్‌కు పారిపోయారు.

సాంకేతిక నిఘా ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular