Monday, May 18, 2026

వృషకర్మ’ మూవీ బిటిఎస్ స్టిల్స్ రిలీజ్

- Advertisement -

వృషకర్మ’ మూవీ బిటిఎస్ స్టిల్స్ రిలీజ్

‘Vrushakarma’ Movie BTS Stills Released

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో అద్భుతంగా సాగుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్‌ ‘వృషకర్మ’ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో 20 మిలియన్ వ్యూస్ దాటి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న లొకేషన్స్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఉన్న భారీ విజువల్ స్కేల్‌ను చూపిస్తున్నాయి. ప్రధాన నటీనటులంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ కథలో కీలకంగా ఉండబోతుంది. ఈ స్టిల్స్ ద్వారా సినిమాకి ఉన్న మిస్టిక్ టోన్, గ్రాండియర్ మరింత స్పష్టమవుతోంది.షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో CGI, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తూ భారతీయ ప్రేక్షకులకు ఎప్పుడూ చూడని సినీ అనుభూతిని అందించేందుకు టీమ్ పని చేస్తోంది. మిస్టికల్ ఎలిమెంట్స్‌ను రిచ్ డీటైలింగ్‌తో, ఇమర్సివ్ వరల్డ్ బిల్డింగ్‌తో అద్భుతంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు.
‘వృషకర్మ’ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ రాగుల్ డి హెరియన్ అద్భుతమైన విజువల్ స్టైల్‌ను అందిస్తుండగా, అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రంలోని మిస్టిక్ ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నవీన్ నూలి ఎడిటర్.
పవర్‌ఫుల్ కాంబినేషన్, భారీ సాంకేతిక ప్రమాణాలు, మైథలాజికల్ టచ్‌తో రూపొందుతున్న ‘వృషకర్మ’ స్కేల్, మిస్టరీ, సినీమాటిక్ గ్రాండియర్ కలయికగా నిలవబోతోంది.
మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు త్వరలో మేకర్స్ నుంచి రాబోతున్నాయి.
తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్, సత్య

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్