Thursday, May 21, 2026

వివాదాస్పద వ్యాఖ్యనుంచి వ్యవస్థీకృత రాజకీయం వైపు

- Advertisement -

వివాదాస్పద వ్యాఖ్యనుంచి వ్యవస్థీకృత రాజకీయం వైపు

From controversial remarks to organized politics

కాక్రోచ్ జనతా పార్టీ

నేపాల్‌లో మాదిరిగానే భారతదేశంలోని జెన్ జీ (Gen Z) యువత ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. దాని పూర్తి కథ ఏమిటనే వివరాల్లోకి వెళితే…ఇటీవల, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ఒకానొక కేసు విచారణ సందర్భంలో, ఉద్యోగం సంపాదించడంలో విఫలమైన దేశ నిరుద్యోగ యువతనుద్దేశించి,వ్యవస్థకు పట్టిన బొద్దింకలుగా సంభోదిం చారు.ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర మైన వ్యతిరేకతతో,దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఒక ఉద్యమం ప్రారంభమైంది, అది ఇప్పుడు ప్రవాస భారతీ యులను సైతం కుదిపి మరింత పెద్దగా మారి కాక్రోచ్ జనతా పార్టీగా అవతరిం చింది.వారు తమను తాము యువ రాజకీయ కూటమిగా చెప్పుకుంటున్నారు.ఈ తీవ్రమైన వ్యాఖ్య దేశ యువతలో విస్తృత వ్యతిరేక తను రేకెత్తించడతో పాటు, యువత రాజకీయంగా సంఘటితం కావడానికి భారతీయ యువతను ఒక్కతాటి మీదకు తెచ్చేంతగా ప్రేరేపిస్తోంది.ఈ ఉద్యమం ఆన్‌లైన్‌లో వేగంగా ఆదరణ పొందుతూ యువతకు ప్రాతినిధ్యం వహించే రాజ కీయ వేదికగా మారుతోంది. మహువా మోయిత్రా,కీర్తి ఆజాద్ వంటి ఎంపీలు కూడా వారికి బహిరంగంగా మద్దతు తెలపడం విశేషం.ఈ ఉద్య మాన్ని బోస్టన్ విశ్వవిద్యాల యం నుండి పోస్ట్-గ్రాడ్యుయే షన్ పూర్తి చేసిన 30 ఏళ్ల వ్యక్తి అభిజీత్ ప్రారంభించా రు.అతను 2020 నుంచి 2022 వరకు ఆప్ పార్టీ వాలంటీర్‌గా కూడా పని చేశాడు.వ్యంగ్యం నుంచి పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఒక వెబ్ సైట్‌ను అలాగే నిర్దిష్టమైన మనిఫెస్టోను సైతం తయారు చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ మ్యానిఫె స్టోలోని ముఖ్యమైన అంశాలు:వివిధ రంగాలలో మహిళలకు 50% రిజర్వేష న్,లింగ సమానత్వం మరి యు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం.
రిలయన్స్ (అంబానీ) మరియు అదానీ వంటి ప్రధాన కార్పొరేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్న న్యూస్ ఛానెళ్ల లైసెన్సులను రద్దు చేయడం ద్వారా స్వతం త్ర మీడియాను ప్రోత్సహించ డం.తద్వారా మీడియా గుత్తా ధిపత్యాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యం.రాజకీయ పార్టీలు ఫిరాయించే ఏ రాజకీయ నాయకుడైనా 20 ఏళ్ల రాజకీయ నిషేధాన్ని ఎదుర్కోవాలనే సంస్కరణ, రాజకీయ అవకాశవాదాన్ని అరికట్టడం మరియు పార్టీ సిద్ధాంతాల పట్ల నాయకుల విధేయతను ప్రోత్సహించడం దీని లక్ష్యం.

కాక్రోచ్ జనతా పార్టీ తన దృక్పథాన్ని మెరుగుపరచు కోవడానికి ప్రజల భాగస్వా మ్యాన్ని మరియు అభిప్రా యాన్ని కోరుతోంది అలాగే సోషల్ మీడియా కామెంట్ల ద్వారా కొత్త కొత్త అభిప్రాయా లు,చర్చలకు పిలుపునిస్తోంది. రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలలో ముందుండటానికి,తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫార మ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసు కోవాలని ఈ ఉద్యమ అనుచ రులను సైతం ప్రోత్సహిస్తు న్నది.కాక్రోచ్ జనతా పార్టీ, యువత పై చేసిన అవమాన కరమైన వ్యాఖ్య యువతలో ఒక ఐక్యతా నినాదంగా మార్చింది.
మొత్తమ్మీద కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో యువ త నేతృత్వంలో మొదలైన ఒక ముఖ్యమైన,అభివృద్ధి చెందుతున్న రాజకీయ ఉద్యమమని చెప్పవచ్చు.ఒక వివాదాస్పద వ్యాఖ్య నుండి పుట్టి,స్పష్టమైన విధానపరమై న డిమాండ్లతో ఒక వ్యవస్థీ కృత వేదికగా రూపుదిద్దు కుంది.మహిళా రిజర్వేషన్, స్వతంత్ర మీడియా మరియు రాజకీయ నైతికతనే అజెండా గా చేసుకుని ప్రస్తుతం దేశం లో చలామణిలో ఉన్న పార్టీల ను సవాల్ చేస్తున్నట్లైంది.
ఇక ఇప్పటి నుంచి ఈ ఉద్య మం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్