అమ్మాయి కోసం గ్యాంగ్ వార్
విజయవాడ, మే 22, ( వాయిస్ టుడే)
Gang war for a girl
విజయవాడ నడిబొడ్డున పటమటలో జరిగిన థార్ కార్లతో గ్యాంగ్ వార్ గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ఇద్దరు యువకులు ఒక యువతి కోసం నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకోవడం, ప్రాణాలు తీసేంతగా కారుతో ఢీకొట్టడం వంటి ఉదంతం నగరంలో శాంతిభద్రతలపై చర్చకు దారితీసింది. విజయవాడలోని పటమట రోడ్డులో గత రాత్రి చోటుచేసుకున్న హైడ్రామా సినీ ఫక్కీలో సాగింది. బొల్లు ఓమ్, లింగమనేని రోహిత్ అనే ఇద్దరు యువకులు తమ విలాసవంతమైన థార్ కార్లలో వచ్చి నడిరోడ్డుపై గొడవకు దిగారు. ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటూ చేసిన రచ్చ సోషల్ మీడియాల ోవరైల్ అయింది. కేవలం ఒక యువతి కోసం మొదలైన ఈ గొడవ, ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరింది. ఒకరు కారుతో మరొకరిని ఢీకొట్టడమే కాకుండా, కారును రివర్స్ చేస్తూ నానా హంగామా చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు బొల్లు ఓమ్ . ఈయన విజయవాడలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మేయర్, ప్రముఖ రాజకీయ నేత బొల్లు బ్రహ్మానందం మనువడు. బొల్లు బ్రహ్మానందం గతంలో కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు కావడంతో బొల్లు ఓమ్ నగరంలో భారీ నెట్‌వర్క్‌ను, అనుచర వర్గాన్ని కలిగి ఉన్నాడు. తాతా, తండ్రుల పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇతడు గతంలోనూ చిన్నచిన్న వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన మాజీ మంత్రి జోగి రమేష్‌కు దగ్గర బందువుని చెబుతున్నారు. ఇక రెండో వ్యక్తి లింగమనేని రోహిత్ . ఘటన జరిగిన వెంటనే పారిపోవడంతో రోహిత్ ఇంకా ఎవరు అన్నది గుర్తించలేకపోతున్నారు. ఆయన రాష్ట్రంలోని ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో లింగమనేని కుటుంబానికి చెందిన యువకుడని చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ గొడవకు కారణం ప్రేమ వ్యవహారమే. స్నేహితులైన వీరిద్దరూ ఒక యువతి విషయంలో గొడపడ్డారు. యువతితో బొల్లు ఓమ్ కారులో వెళ్తున్న సమయంలో పటమటలో ఎదురెదురుగా వచ్చిన ఈ ఇద్దరు.. మొదట మాటలతో మొదలుపెట్టి, ఆపై తమ వాహనాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. పీక్ అవర్స్‌లో జనం ఉన్నప్పుడే ఒకరి థార్ కారును మరొకరు ఢీకొట్టుకుంటూ అక్కడి వాతావరణాన్ని రణరంగంగా మార్చారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పటమట పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం హా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, నగరంలో ఇలాంటి ఉన్మాద చర్యలను సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. వారి వద్ద ఉన్న థార్ కార్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన విజయవాడలో రాజకీయ పలుకుబడి ఉన్న బలవంతుల వారసుల ప్రవర్తనపై మరోసారి చర్చకు తెరలేపింది.



